పుట:Andrulasangikach025988mbp.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారే, వారును తెనుగు దేశమందే, ఒక గారడి విద్యగా ప్రదర్శించెడి వారు.

ప్రహేళిక:- దీనికి పర్యాయపదము ప్రవల్హికా అనియు, దాని కర్థము 'గూడముగా నుంచబడిన యర్థముల కావ్యవిశేషము' అని శబ్దరత్నాకరములో వ్రాసినారు. ఇది స్పష్టముగా అర్థముకాని రీతి తెలిపినారు. తెనుగులో తట్టు - తట్ట వేయుట అనుట యిదియే. 'కొందురు, తిందురు', 'ముందర పెట్టుకొని యేడ్తురు' అంటే యేమి ? అనగా ఉల్లిగడ్డ అని చెప్పుట తట్టు అని యందురు. తిరుమలేశ పద్యాలు ప్రహేళికలే. తిరుమలేశు డెవ్వడో యెవ్వరును అతనిని స్మరింపరు.

శబ్దకల్ప దుమములో ఇట్లు వ్రాసినారు:- ప్రహేలికా=ప్రహిలతి అభిప్రాయం సూచయతీతి కూటార్థభాషితాకథా॥

దీనికుదాహరణములు 'తిరుమలేశ పద్యాలు'. అవి తెనుగులో ప్రసిద్ధమైనవి.[1]

వేట, రాజులలోనే విశేషముగానుండినట్లు కవులు వర్ణించినారు. వేటలలో పక్షివేటకు విశిష్టతకలదు. సంపన్నులు డేగలతో పక్షులవేటాడుచుండిరి. ఆ డేగలు "కౌజు కక్కెరలను" మున్నగు పక్షులను చంపుచుండెను.

     సీ. కేరిజంబుల గోరి కేరుట దీరించి పూరేండ్ల బుడకల బూడ్దెకలిపి
        పాలగుమ్మల నేలపాలుగా నొనరించి వెలిచెల మెలకువ వెలితిచేసి
        బెగ్గురు కదుపుల బెగ్గిల మ్రగ్గించి కొంగల పొగరెల్ల ద్రుంగద్రొక్కి
        కక్కెర నెత్తురు గ్రక్కించి కొక్కెర పిండు గుండియలెల్ల బెండుపరచి
        కారుకోళ్ళ నెండ గారించి గొరువంక బింక మింక వాని పొంక మణచి
        చెమరు బోతుగముల జమరి కౌజుల జించి సాళువంబు జయపాలు జేరె.[2]

ఈ పద్యములో పాలగుమ్మలు (పాలపిట్టలు), వెలిచెలు, బెగ్గురు (సారసము) కొంగలు, కొక్కెర, కారుకోళ్ళు, గొరవంక, కౌజు (కముజు) అనుపిట్టల పేర్లు పల్లెజనులు (పట్టణవాసులు కారు) ఎరుగుదురు కాని, తక్కిన పక్షుల పేర్లు

  1. శివరాత్రి మహాత్మ్యము, అ 2. ప 87 (పైనాల్గాటల చర్చ అందు కలదు)
  2. సింహాసన ద్వాత్రింశిక, 1 భా. పు 26.