పుట:Andrulasangikach025988mbp.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ యాటలు ఆడువా రెక్కువగా ఆడుచుండిరి. అంజి యను నాటయెట్టిదో శబ్దరత్నాకరకారునికే తెలియదు. సొగటాలు అనునది పాచికల ఆట, దానికి పగడసాల, పగడసారె ఆట యనియు అన్నారు పలువురు కవు లీయాటను ప్రబంధాలలో వర్ణించినారు. ధనికులైనవా రీయాట పలకల సిద్దము చేయించి యుంచుకొనెడివారు. అచ్చనగండ్లు యిప్పటికినీ బాలికలు, యువతులు ఆడుచుందురు. దానికి అచ్చనగాయలు అనియు పేరుకలదు. క్రచ్చకాయలతోకాని, చిన్నవి గుండ్రని గులకరాలతో కాని ఆడుదురు. ఓమనగుంటలు ఒక కట్టె దిమ్మలో 14 గుంతలు చెక్కించి వాటిలో చింత బిచ్చలు పోసి యాడు ఆటకు పేరు.

యువకు లాడుకొన్న యాట లెట్టివనగా, కందురకేళి - ఇది చెండుఆట.

బహుశా బట్టలతో గట్టిగా గోళాకారముగా చేసి దానిపైన గట్టి లావుదారముల జాలె నల్లుచుండిరేమో, అట్టివి 50 ఏండ్ల క్రిందట యుండెను.

పిల్లదీవాటలు:- ఇది "విమల చంద్రోదయారంభ వేళలందు" ఆడుచుండిన యాటయని శ్రీనాథుడు వర్ణించెను. ఇదెట్టి యాటయో తెలియదు. "బాలక్రీడా విశేషము" అని శబ్దరత్నాకరములో వ్రాసినారు. నాలుగైదునూర్ల యేండ్ల క్రిందటి చాలా యాటలు మనకు తెలియకపోవుట విచారకరము.

భాండిక జనుల పరిహాసములు:- "ఒక కొంత ప్రొద్దు భాండికజనంబు లొనర్చు పరిహాస గోష్ఠికి పల్లవించు" అన్నారు. కాని భాండికశబ్దము శబ్దరత్నాకరములో లేదు. సంస్కృత బృహన్నిఘంటువగు శబ్ద కల్పద్రుమమందును ఈపదములేదు కాని "భండ:=అశ్లీలభాషీ" అని కలదు. తత్సంబంధి భాండికుడు అని వ్యాకరించుకొనిన నీసందర్భమునకు సరిపోవును. బూతులతో హాస్య ముత్పత్తిచేయు 'వికటకవి' వంటివాడని యర్థము కలుగును.

బిందుమతీవిద్య:- ఇది గారడి (ఇంద్రజాలం) విద్య. శబ్దరత్నాకరములో ఈ శబ్దమే లేదు. సంస్కృత నిఘంటువగు శబ్దకల్పద్రుమ మందును ఈ పదము లేదు. బిందుమతి యనునది "విప్రవినోద" అను ఇంద్రజాల విద్యవంటిది. విప్రవినోదమను విద్యను ఒక విదమగు బ్రాహ్మణ జాతి