పుట:Andrulasangikach025988mbp.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      "పూజకుండలు నిల్పె పువ్వుబోడి యొకర్తు శుభ వితర్దిక చతుష్కోణములను
       జాజాల పాలెల సర్వౌషధులు నించి ప్రోక్షించె నొక్క పద్మాక్షి జలము
       కాంత యొక్కతె సన్నెకలు పొత్తరంబునుదోరించె వటశాఖతోడ గూడ
       పీఠికంబులు పెట్టి బింబోష్ఠి యొక్కతె మడుగు పుట్టము కప్పెవడుగుమునగ"
       .... ..... ..... ...... ..... ..... .....
      "తగవు లిచ్చిరి పుట్టింట తల్లిప్రజలు వీళ్ళొసంగిరి చుట్టాలు వేనవేలు
       కట్నమిచ్చె నృపాలుండు కన్నుదనియ పరమహీపాలు లిచ్చిరి పావడములు"[1]

       పురిటి సమయముళొ చేయు నుపచారములను శ్రీనాథుడిట్లు వర్ణించెను.

      "తలయంపి ధవళ నిద్రాకుంభ మిడువారు రక్షాభసిత రేఖ వ్రాయువారు
       గౌర నర్షపరాజి కలయ జల్లెడివారు బలివిధానంబుల బరగువారు
       లవణంబు నింబవల్లవము ద్రిప్పెడు వారు ప్రేము మంచంబుతో పెనుచువారు
       గవల ధూపంబు సంఘటియించువారును మంచిమి ట్టెడద యోజించువారు
       కదసి దీవించువారును గండతైల మందుకొనువారు గాయంబు లందువారు
       పాడువారును పరిహాస మాడువారునైరి శుద్ధాంతసతు లరిష్టాలయమున"

     "కర్పూర సమ్మిశ్ర గంధసారంబున చరచె చప్పట భిత్తి చామ యొకతె
      వెల్లకిలబెట్టె మత్పలగంధి యొక్కర్తు గర్బ గృహోపకంఠభూమి
      జ్యేష్ఠాధిదేవత సేవించె నొకయింతి పసుపు పుట్టము గట్టి భక్తిగరిమ
      పటముపై లిఖియించె పాటలాధరి యోర్తు క్రొత్తలత్తుక శశాంకుని ఖరాంశు
      జరఠ మేషంబు కంఠదేశమున జుట్టె పుష్ప డుండుభముల నొక్క పువ్వుబోడి
      ఆంబుజానన యొకతె నెయ్యభిఘరించె భుజగ నిర్మోకమొకతె నిప్పులగమర్చె"[2]

సింహాసనద్వాత్రింశతిలోని యాచారాలు తెలంగాణమువై యుండును. ఇందలివి కృష్ణా గోదావరీ మండలాలవై యుండును.

జనులు తమ బిడ్డలకు భర్తలయిండ్లకు పోయిన తరువాత ఆవులను అరణమిస్తూ వుండిరి.[3]

  1. శివరాత్రి మహాత్మ్యము. అ 2. ప 54, 56, 62.
  2. శివరాత్రి మహాత్మ్యము. అ 2. ప 70, 71 తర్వాతవికూడ చూడతగినవే.
  3. 'తనదు గాదిలి పుత్రికి నీదలంచెనో' - భోజరాజీయము. ఆ 6.ప 39.