పుట:Andrulasangikach025988mbp.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, పువ్వులతో కాని, ఫలములతో కాని చేస్తూ వుండిరని కవియే తెలిపినాడు. మద్యములలోని కొన్నింటిని ప్రౌడకమల్లన ఇట్లు తెలిపెను.

       శార్కరంబు, సూనజము, గుగ్లుసుమఘృతజంబు, నారికేళజంబు, మాద్వి
       కంబు, ఫలమయంబు, గౌడ తాళమయంబు, నాదిగా తనర్చు నాపవములు.
                                              (రుక్మాంగద. 3 - 227)

అల్లరి పాడియావులు పాలియ్యక పొడిచి తన్నిన వాటికి తలకోలకట్టి అనగా త్రాడుతో కొమ్ములకు బిగించి, దానినొకకోలను కట్టి, దానితోవడద్రిప్పి పట్టి పాలు పితికెడువారు.[1]

జనులలో పరుసవేదిపై - లోహాల నన్నింటిని బంగారు చేయురహస్య రసాయన క్రియపై - విశ్వాసము మెండుగా నుండెను. భోజుడు సర్పటి యను సిద్ధుని మోసగించి ధూమవేధి యను స్పర్శవేది క్రియను నేర్చుకొనెనని భోజరాజీయములో అనంతామాత్యుడు వర్ణించినాడు. ఒక కోమటిని మోసగించి వేమారెడ్డి ఆ విద్యను నేర్చి కొండవీటి రాజ్యమును స్థాపించెనను కథలను అనేక విధములుగా జనులు చెప్పుకొనిరి. అదెంత సత్యమున్నదో చెప్పజాలము. ప్రోలయవేమునికి పరుసవేదీయో, తత్సమాన నిధియో యేదో దొరికినట్లే నమ్మవలెను. ప్రోలయవేముని మంచాళ్ళ శాసనములో (శా. శ. 1262 = క్రీ.శ. 1340లో) ఇట్లు వ్రాసిరి.

       "యదృచ్చయా స్వర్ణకర ప్రసిద్ధిం
        లబ్ద్వాన్నమాంబా పతి రాబభూవ"[2]

ఈ స్వర్ణకర ప్రసిద్ధి యెట్టిదో తెలుపలేదు. కొండవీటి దండకవిలెలోను దీన్నిగురించిన ఒక కథకూడ వ్రాసినారు.

హిందువులలో క్రీస్తు శకాదినుండియో లేక బౌద్దశకాది నుండియో స్పర్శవేదిని కనిపెట్టుటకై పాదరసముతో కొన్ని ఓషధుల రసము, పసరుచేర్చి అందు ఇనుము, రాగి వంటి లోహాలు వేసి పుటాలు పెట్టి కరగించి వెండి, బంగారు చేతుటకై చాలాపరిశోధనలు చేసిరి. సిద్ధనాగార్జునుడు వెండి, బంగారు చేయుట

(ఆలరి మొదవులకును తలకోల యిడక చేరి పిదుకుకొన తరమగునే)

  1. సింహాసన ద్వాత్రింశిక. భా 1. పు 103.
  2. సింహాసన ద్వాత్రింశిక. భా 1. పు 51.