పుట:Andrulasangikach025988mbp.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన ముత్తైదువయే. ముత్తైదువయే సతియగుట చేత దూరాన్వయముగా ఆట్లు చెప్పినారేమో కాని పై పద్యములో "పేరటంబులను పోక తొరంగి" అనుటలో వితంతువును శుభకార్యాలలో పేరంటము పిలువరనియు, సహగమనము చేయువారు అరుదై వైధవ్య బహువిధవ్యధలకు గురియైన వితంతువులే బహుళమై యుండిరనియు స్పష్టమవుతున్నది. అధునాతన సనాతన వాఙ్మయమందును ఆచారమందును పేరంటముగా పిలువబడిన ముత్తైదువకే పేరటాలు అను నిదర్శనాలే కానవస్తున్నవి. "రెండవ దేవరాయలకు 12000 భార్యలుండి రనియు అతడు చచ్చిన అందు 3000 మంది భార్యలైనను సహగమనము చేయవలసి యుండు ననియు నికోలా కౌంటు అను యూరోపు యాత్రీకుడు వ్రాసెను. ఆతడింకను ఇట్లు వ్రాసెను. "సతి లేక సహమరణము ఈ విజయనగర సామ్రాజ్యములో వ్యాపించినది. సతిని భర్త చితిపై కాల్తురు. కొందరు భర్త శవముతోపాటు భార్యను సజీవముగా పూడ్చివేయుదురు." సహగమనము విరివిగా లేకుండెననియు, కొన్ని పెద్ద కులాలలో అది వ్యాప్తికి ప్రారంభమయి యుండెననియు, తలంపవచ్చును.

మద్యములు అనేక విధములైన ప్రజలు సిద్ధము చేసుకొనుచుండిరి. గౌడీ, పైష్టీ మాధ్వీ మొదలైనవి ప్రాచీనులు వర్ణించినారు. అవికాక మరికొన్ని విధములైనవి రెడ్డిరాజుల కాలమందుండెను.

"ఒక్కెడం గొందరు సుందరులు పానగోష్ఠికిం గడంగి, కాదంబంబును, మాధవంబును, ఐక్షవంబును, క్షీరంబు, అసవంబు, వార్షంబు, రతిఫలంబు లనపాక భేదంబుల మూలస్కంధ కుసుమ ఫలసంభవంబుల బహువిధంబుల మధురంబులైన మధువిశేషంబులెల్లం బరిమళ ద్రవ్యమిళితంబుగా గూర్చి పాత్రంబుల నించిరి."[1]

పై మద్యభేదములో మాధవము యన ఇప్పసారాయి, ఐక్షవ మన చెఱకు (బెల్లము) రసముతో చేసినగౌడీరసము, ఆసవముయన సాధారణముగా వైద్యులు చేయు మద్యద్రవ్యము, కాదంబము, క్షీరము, వార్షము, రతిఫల మన నేమియో తెలియదు. నిఘంటువులందును ఈ పదాలు లేవు. ఈమద్యములను చెట్ల వేర్లతో

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 103.