పుట:Andrulasangikach025988mbp.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యముగా ఇది కాశ్మీర, రాజపుత్రస్థాన, పంజాబుదేశాలలో ప్రబలమయ్యెను. తర్వాత బెంగాలులో ప్రబల మయ్యెను. దక్షిణ దేశములో కాకతీయుల కాలములో, రెడ్డిరాజుల కాలములో ప్రారంభమై అరుదుగా నందందు జరుగుటకు మొదలయ్యెనని తలంతును. సింహాసనద్వాత్రింశికలో ఒకబంటు తనభార్యను రాజువద్ద రక్షణార్థముంచి యుద్ధాని కేగుదునని చెప్పి గాతిలో మాయమయ్యెను. వెంటనే పైనుండి వానిఅంగాంగములు భిన్నములై రాజుముందట పడెను. అప్పుడు వాని భార్యసహగమనము చేతుననియు సెల విమ్మనియు రాజును కోరెను. రాజు వలదని పలువిధముల వారించెను. ఆమె వినక ముష్కరించెను. తుదకు విధిలేక రాజు సెలవిచ్చెను, అని విపులముగా వర్ణించినారు. సహగమనమే సాధారణాచారమై యుండిన ధర్మమును పాలించు ప్రభువే వలదని వారింపబోవునా ? ఆ స్త్రీ సహగమనావసరమునుగూర్చి అంతపెద్దగా నుపన్యసించునా ? దాని ప్రచారమునకై పెంచిన వర్ణన యని తోచక మానదు. ఆమె యిట్లనెను.

         "అకులపాటుతోడ అశు
          భాకృతియై యొకవేళనైన, పో
          కాకును లేక, సొమ్ములకు
          నర్రులు సాపక, పేరటంబులన్
          పోక తొరంగి, పూతలును
          పువ్వులు దూరముగాగ ముండయై
          యేకడ జేరినన్ విధవ
          కెగ్గులె కాక తరింపవచ్చునే ?
          చచ్చియు చావక తనలో
          వెచ్చుచు నియమముల నింక విధవాత్వమునన్
          నిచ్చట మాడుటకంటెను
          చిచ్చురుకుట మేలు సతికి క్షితి మెచ్చంగన్."[1]

నతియను ఘోరాచారము తెనుగు గడ్డపై పాదుకొన్నది కాదనియే తలంతును. పై పద్యములో విధవకుండు కష్టాలు చాలా చక్కగా కవి తెలిపినాడు. అందు "పేరటాలు" అనగా సహగమనము చేసిన 'సతి' కి అర్థమని శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మగారు తమ రెడ్డి రాజుల చరిత్రలో వ్రాసినారు. పేరటాలు

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 110.