పుట:Andrulasangikach025988mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నగర కాలాలలోని ఆంధ్రులను గూర్చి కొన్ని వ్రాసిరి. అవి చాలా సహాయము చేయును. కాని అందు వ్రాసిన వ్రాత లన్నియు నిజ మని నమ్మరాదు. "విజయనగర రాజులు ఎలుకల, పిల్లుల, బల్లుల తినిరి" అని యొక్క యూరోపు యాత్రికు డానాడు వ్రాసెను. దీనిని నమ్మవచ్చునా? ఇది పూర్థిగా అబద్ధము. ఫ్రిరిస్తా వ్రాసిన చరిత్ర పలుతావులలో అబద్ధాలతో నిండినది. ;గంగా దాస ప్రతాప విలాసము' అను సంస్కృత నాటకమందు రెండవ దేవరాయలు చనిపోయిన వెంటనే అదే యదనని ఓడ్రగజపతియు, బహమనీ సుల్తానును కలిసి విజయనగరముపై బడిరనియు, అప్పుడు మల్లిఖార్జునుడు వారి నోడించి పారగొట్టెననియు వ్రాసినారు. దీని ముచ్చట ఫెరిస్తా వ్రాసిన చరిత్రలో లేనేలేదు. (Ancient India Vol. 2. by S.K. Iyengar, P.40). ఫెరిస్తాయే దేవరాయ లోడి తన బిడ్డను బహమనీ సుల్తాను కిచ్చి పెండ్లి చేసెనని వ్రాసెను. ఈ ముచ్చట దేశ విదేశి చరిత్రకారులు కాని, సమకాలికులు కాని, తర్వాతివారు కాని యెవ్వరును వ్రాయలేదు. ఏ కైఫీయత్తులో ఈ ముచ్చట కానరాదు. ఏ కవితలో కాని, చాటువులో కాని ఏ సూచనయు లేదు.

చిత్తరువులను చూచి వ్రాయుదమన్న అవి తురకలచే ధ్వంసమయ్యెను. విజయనగరమందు రాజు మొదలుగ రౌతు వరకు, రాణి మొదలుగ సాని వరకు తమ తమ యిండ్ల గోడలపై చిత్తరువులు వ్రాయించిరని అనేక నిదర్శనాలు కలవు. చక్రవర్తుల రాణివాసము, వారికై దేశవిదేశి జనుల రూపాలు, నానావిధ జంతువులు, బహువిధములైనవి చిత్రింపబడెను. ఆ భవనము లేవి? అన్నియు విజేతలగు సుల్తానుల సైన్యాలు ఆరునెలల పోట్లతో మంట గలిపెను. శిలా శిల్పములు కూడా ముప్పాతికకు పైగా చూర్ణమయ్యెను. ఓరుగంటి బోగ మిండ్లలో కూడా చిత్రశాల లుండెను కదా? ఆ నగరము జాడలేకుండా ధ్వంసమయ్యెను.

పూర్వపు జానపద గీతములను సేకరించినవా రరుదు. తందాన కథల నాదరించినవారు లేరు. అందుచేత తాళ్ళపాకవారి కవిత్వం కొంత నాపైత్యం కొంత చేర్చి చదువు వచ్చీరానివారో లేక కథ చెప్పే జంగాలో కథ లల్లరి. నాణెములను సేకరించినవారు కానరారు. ప్రభుత్వము కొంత పనిచేసెను. కాని కొన్నిటినయినా మనము చూడగలిగినాము.

కొన్ని సంవత్సరముల క్రిందట కృష్ణరాయల కాలమునాటి సాంఘిక చరిత్ర అను వ్యాసమును సిద్ధముచేస్తిని. అదేపనిగా ఆముక్తమాల్యదను ఆయన