పుట:Andrulasangikach025988mbp.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిండ్ల లోపలిభాగములో చతుశ్శాలాభవంతిని కట్టుతూ వుండిరి. పడసాల (వరండా), మొగసాల (Entarance Hall) యింటిముందరుగులు, దొడ్డివాకిలి, పెరడు ఇవి సాధారణమయినవి. ఇండ్లకు కొన్ని వాస్తుశాస్త్రములు బయలుదేరెను. వాటి లెక్క ప్రకారము దూలము శూలలేకుండా వాకిండ్ల సంఖ్య బేసిగా ఉండకుండా, యెన్నెన్నో నిబంధనలుచేసిరి. సాదారణముగా వంటశాలను తూర్పుగానే పెట్టుతూ ఉండిరి. ఇండ్లు కట్టితే, అందలి స్తంభాలకు పెండ్లి చేసే బ్రాహ్మణుని పిలిచి స్వస్తిచెప్పించి పుణ్యాహవాచనము చేయించి శాంతికై బంధువులకు, బీదలకు, రుచ్యాన్నముల విందునిస్తూ వుండిరి. ఇండ్లకు పశుబలుల నిస్తూ వుండిరి. ఇండ్లలో నొక గదిలో చిల్లర వస్తువులుంచుటకు కట్టెపలకలలో నొక పెద్దాడ్డగూడు (అల్మారీ వంటిది) నిర్మిస్తూవుండిరి. దానిని అట్టుక (అట్టుగ, అట్టిక, అట్టువ) అనిరి.

         "పగలెల్లన్ వెలినిచ్చి రాతి రరుదౌ
          భంగిన్ స్వగేహంబు, ఆ
          ట్టుగమీదన్ వసియించి"[1]

అను నిదర్శనములు ప్రబంధాలలో చాల కలవు. బట్టలు ఆరవేయుటకు పొడవగు బొంగులను మిద్దెకు వ్రేలాడ గట్టెడివారు. వాటిని దండెలనిరి.

         "దండియపై నిడ్డ తపనీయమాలిక
          భుజము సోకిన దాని బుచ్చికొనుచు"[2]

అని యొక కవి వర్ణించెను. ఇచట మాలిక అన దండ. బంగారుదండను దండెమకొనకు తగిలించి యుండిరని అర్థము. వాస్తు శాస్త్రములలో సర్వతో భద్ర, స్వస్తిక, పుష్పకాది నామములు, గృహనిర్మాణ విభేదములను తెలుపునవై యుండెను. రాజులు తమ ప్రాసాదములకు, కొలువు కూటములకు శుభనామములిస్తూవుండిరి. శ్రీకృష్ణదేవరాయల సభా భవనము పేరు, "భువన విజయమై" యుండెను. వీరభద్రారెడ్డి సౌధంబు పేరు "త్రైలోక్య విజయము."

  1. కేయూర బాహుచరిత్ర అ 3; ప 239.
  2. సిం.ద్వాత్రింశిక, భా 2. పు. 88.