పుట:Andrulasangikach025988mbp.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజా జీవనము

ఆ కాలపు ప్రజల వేషాదికము లెట్టివో, ఆచార లెట్టివో, జీవితవిధానము లెటువంటివో, విశ్వాసము లెటువంటివో కనుగొందము.

సాధారణముగా జనులు ధోవతి కట్టువారు. శూద్రజాతిలో రాయలసీమ తెలంగాణములందు చల్లాడములు తొడుగుతూ వుండిరి. దుప్పటియు గుండు రుమాలయు సాధారణవేషాలు. కొందరు చుంగుల లపేటా రుమాలల కట్టిరి. పలువురు నడుములో బెత్తెడు వెడల్పున ఏడెనిమిది మూరల పొడవునుకల కాసె (దట్టిని) బిగిస్తూవుండిరి. వారికి అంగీలు లేవనికాదు. వాటివాడుక తక్కువ. అంగీలు నిడుపై బొందెలు కలవై యుండెను. కవుల వర్ణనలలో కొందరి వేషాలెట్టివో తెలియవచ్చెడివి. గారడిపనిచేయుబంటును నిట్లు వర్ణించిరి.

          "అయ్యెడ నొక క్రొత్తయైన మహావీరు
           డిందియ డాకాల లమర బూని
           బాగుగా పులిగోరు పట్టు, దిండుగగట్టి
           నునుపార మేన చందన మలంది
           తిలకంబు కస్తూరి తిలకించి, చొళ్ళెంబు
           చెంగులపాగతో చెన్నుమీర
           హనుమంతు వ్రాసిన యరిగబిళ్ళయు, వాలు
           గరముల జయలక్ష్మి గడలు కొనగ
           నొకడువచ్చె వెనుక నొక్క బింబాధరి
           అందు దుప్పటి ముసు గమరబెట్టి
           మేనికాంతి కప్పులోన గ్రిక్కిరియంగ
           హంసయాన యగుచు నరుగుదేర."[1]

పై పద్యములో పులిగోరుపట్టు అనగా పులిగోరు వన్నెవంటి పట్టు అని యర్థము. పట్టులలో కొన్నిభేదము లుండెననియు, అం దిదొక్కటియనియు తెలుపనయినది. దిండుగట్టుట యన సెల్లగా చంకక్రిందనుండి మెడపై వైచు కొనుటకర్థమై యుండును. పై పద్యము దిగువనే "ద్రిండుతోడగూడ మొండెము

  1. సింహాసన ద్వాత్రింశిక, భా 2. పు 108.