పుట:Andrulasangikach025988mbp.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంగీత నాట్యశాస్త్రములలో కొన్నిరచనలు రాజులే చేసిరి. కుమారగిరి వసంతరాజీయ రచనల కుదాహరణముగా అతని యుంపుడు కత్తెయగు లకుమాదేవి నాట్యము చేస్తూవుండెడిది.

          జయతి మహిమా లోకాతీత: కుమారగిరి ప్రభో:
          సదసి లకుమాదేవీతాస్య ప్రియాసదృశీప్రియా
          నవ మభినయం నాట్యార్థానాం తనోతి సహస్రదా
          నితరతి బహు నర్థానర్థి ప్రజాయ సహస్రశ:

ఎందరు లకుమాదేవులు కాలగర్బమున నణగిపోయిరో యేమో! "తురకల పారసీకనృత్యము దేశమందు ప్రచారమై జనుల నాకర్షించుట చేత పెదకోమటి వేముడు తన నాట్యశాస్త్రములో ఒకక్రొత్తనృత్యమునకు అనగా పారసీక నర్తనమునకు 'మత్తల్లినర్తనము' అను పేరు పెట్టివర్ణించెను."[1] జనసామాన్యములో అనేక విధములగు నృత్యము లుండెను. వాటిని ముందు తెలుపుదును.

సంగీతములో జనసామాన్యానికి "జతిగ్రామ" విధానముపై ప్రీతియుండెనట.

         "దుత్ర తాళంబున వీరగు బీతక ధుం
          ధుం ధుం కిటాత్కార సం
          గతి వాయింపుచు నాంతరాళిక యతి
          గ్రామాభిరామంబుగా"

అని క్రీడాభిరామములో వర్ణించిరి. యతి అనునదే జతి. యతితద్బవమే జతి. యతి అనునదియు, గ్రామ అనునదియు వివిధమగు స్వరభేదములు.

రెడ్డిరాజులును, వెలమ రాజులును గొప్ప కోటలు, దేవాలయాలు నిర్మించి, అపూర్వ భవనములుకూడా కట్టించిరి. కొండవీటి దుర్గము మహాదుర్గములలో నొకటి యని ప్రఖ్యాతి కాంచినట్టిది. అందు చాలా మేడలుండెను. వాటిలో "గృహ రాజు" మేడ ఒంటిస్తంభము మేడ అను ప్రసిద్ధికలదై యుండెను. నేటికిని "గుర్రాజుమేడ" అను దిబ్బను జనులు చూపుచుందురు. అంతేకాదు, వారు క్రీడా

  1. Hist. R. K. Page 282