పుట:Andrulasangikach025988mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైన పేర్కొనబడినవాటిలో ప్రత్తినూలుబట్టలును, పట్టుబట్టలును కలవు. నూలుబట్టలలోని అంచుల భేదము లందు తెలుపబడినవి. ద్రౌపదీ స్వయంవరము శ్రీరామ శ్రీకృష్ణ అను పేరులు కలవి అంచులు కావేమొ! కొంగులపై కట్టెపలకలపై చెక్కిన బొమ్మలను రంగులపై అచ్చువేయు చుండిరేమో! కామవరము, సూరవరము అను పేరులు చెప్పుటచే, ఆ రెండుస్థలాలు బట్టలకు ప్రసిద్ధి చెందెననవలెను.

ఇన్ని పేర్లుకల అంచులనుగురించి చెప్పునప్పుడు రంగుల పరిశ్రమ విశేషముగా నుండెననుట స్పష్టమే. చెంగావి అనునది లేతవన్నెయై యుండును. కరకంచు అనుటచే కరక్కాయచెక్కతో వన్నె వేయుచుండిరేమో! (ఆ తర్వాత సూ.రా.నిఘంటువును జూడగా అందు "కరక్కాయ నీటితో వ్రాసిన అంచు" అని యుండుట గాంచితిని.) బొమ్మంచు అనిన తెల్లచీరల యెర్రఅంచు. చిలుక చాళ్ళు అనుటచే చిలుక పచ్చనివన్నె వాడి రనవచ్చును. ఉఱత యన ఉడుత, దాని చారలవంటి వన్నెలుండెను. రుద్రాక్షవన్నె యిప్పటికినీ వాడుకలో కలదు. నీలిమందు చేయుట చాలా ప్రాచీన పరిశ్రమ. ఆ రంగు అన్ని రంగులకన్న మిన్నయైయుండెను. నీలిరంగు హిందువులే కనిపెట్టిరని దానికి ఇండిగో అని పాశ్చాత్యులు పేరు పెట్టిరి. మంజిష్ఠ, లక్క, పసుపు మున్నగునవి రంగులు చేయుటకు వాడుతూ వుండిరి. పట్టులో నీలిపట్టు అనుటచే దానికి నీలిరం గిచ్చి రన్నమాట. హొంబట్టు అనుటచే జరీఅంచులుకల పట్టు అని యర్థమగును. రంగులచేయు వృత్తివారు ఒక కులముగాకూడా తర్వాత యేర్పడినట్లు కానవస్తున్నది.

"బంగారువ్రాత నిండుమాదావళి దట్టిగట్టి"[1] యని వర్ణించిన దాన్నిబట్టి జలతారుఅంచు కల కపిలవర్ణపుకాసెదట్టి అనగా జేనెడు వెడల్పు కలది. జెట్టీలు నడుములో బిగించుచుండిరని తెలియవచ్చెడి. ఇపుడు దట్టియన స్త్రీలు కట్టుకొను చీరయని యర్థము. కాన ఆకాలమందు నడుము పట్టికి దట్టి యనిరి.

విదేశములనుండి మన తెనుగు దేశములోనికి దిగుమతియగు వస్తువులను ఇదివరకే యుదహరించినాము. అవేవో తెలుసుకొందుము. కుమార

  1. చరిగొండ ధర్మన్న చిత్రభారతము, అ 2. ప 66.