పుట:Andrulasangikach025988mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        సీ. ప్రకటింతు కేసరిపాటి క్షేత్రంబుల
           నలరిన బీజసంఖ్యాత మదియు
           నూటపండ్రెండరపాటిగా నొకతూము
           ఏబదారుంబాతి కిరస యయ్యె
           ఇరువదెన్మిది పర కేర్పడ గుంచెడు
           పదునాల్గువీసముల్ పరగు నడ్డ
           ఏడొక యరవీస మేపార మానిక
           మూటిపై నరకాని మున్ను తవ్వ
           ఒకటి పాతికయు జూడ నొక్కసోల
           ఏడుపరకల దా నొనగూడెనేని
           పరగ నరసోల యెరుగుడీ వరుసతోడ
           గణితపండిత విను మిది గణితమతము.[1]

భూమికొలతలలో నివర్తనములనియు లేక మరుత్తులనియు వ్యవహరించిరి. పదిచేతులు (మూరలు) = ఒకదండము, పదిదండములు = ఒకనివర్తనము; పదినివర్తనములు = ఒకగోచర్మము.[2] రెడ్డిరాజులకాలములోని భూమికొలతలు అప్పటి యాధారములనుబట్టి యీ విధముగాకూడా యుండెను.

4 మూరలు = ఒక బార
4 బారలు = ఒక గడ
400 గడలు = ఒక కుంట
100 కుంటలు = ఒక కుచ్చెల లేక ఖండిక లే తూప

సువర్ణాదుల తూకములను మాడలతో కావిస్తుండిరి. మాడ అనగా అర వరహా అని శబ్దరత్నాకరకారుడు వ్రాసినాడు. అదొక చిన్న బంగారునాణెము. కొండవీటి రాజులకాలపు కవియగు కొరవి గోపరా జిట్లు తెలిపినాడు.

         "ఎన్న నాల్గుమాడలె త్తొజకర్షంబు
          నాల్గుకర్షలైన నగు పలంబు

  1. Hist. R. K. Page 365.
  2. Hist. R. K. Page 367.