పుట:Andrulasangikach025988mbp.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారియను నర్థములో, దర్పదౌర్జన్యయుతుడను నర్థములోను వాడిరి. రట్టడిపదమే క్రమముగా రెడ్డియయ్యెను. క్రీ.శ. 1400 ప్రాంతమునుండి రెడ్డిపదము స్థిరపడి పోయెను. (రెడ్డిసంచిక, పుటలు 96-118; 388-392) ఇతర జాతులలో అంతశ్శాఖలు ప్రబలినట్లుగా రెడ్లలోను కొన్నిశాఖ లేర్పడెను. అవి విశేషముగా సీమలనుబట్టి యేర్పడెను.

గుంటూరు జిల్లాలో నరసారావుపేట తాలూకా కొణిదెస గ్రామములోని శాసనమం దిట్లున్నది. "ఫొత్తపిచోడ మహారాజులు యేలెడి భూమియైన కమ్మ నాంటి రాచకొడ్కులు, మందడ్లు, నూక నాయకులు, మొట్టవాడ గుంటికర్త రాచకొడుకులు, దేనట్లు, నూకనాయకులునై కూడి శకవర్షంబులు 1069 సంక్రాంతినాడు శ్రీకొట్యదొన కేశవదేవరకు నిచ్చినకాన్కి-యూరరూకయు, ఉల్వరిపాదికయు నిచ్చితిమి" (ఊర రూక, ఉల్వరిపాది అనునవి గ్రామములో వసూలుచేయు కొన్ని పన్నులు, గ్రామముఖ్యులు, గ్రామదేవాలయముల నిర్వహణకు పన్నుల వేయు అధికారము కలిగియుండిరన్నమాట) "రెడ్లలో అనేక భేదములు కలవు. పాకనాటి, పంట వెలనాటి, రేనాటి, మొరస, పల్లె-ఇవి నాడీ భేదముల బట్టి ఏర్పడినవి. గోటేటి, ఓరుగంటి, పెడకంటి, కుంచేటి, మోటాటి, దేసూరిరెడ్లు నివాస గ్రామములబట్టి యేర్పడిన భేదములు (రెడ్డి సంచిక-పుటలు 128; 139)

వైశ్యకులములో కోమటివారు చేరిరి. వారిలో కొన్ని విభేదాలుండెను. దీనిని గురించి మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఇంగ్లీషులో వ్రాసినదాని నిందను వదింతురు.

"ప్రౌడదేవరాయకాలంలో వైశ్యులు వైజాతీయులు కులవివాద పరిష్కారమును కోరగా అరాజు కోలాచల మల్లినాథుని మరికొందరి పండితులను ధర్మాసన పరిష్కర్తలనుగా నేర్పాటుచేసెను. అంతకు పూర్వ మొకప్పు డిట్టి వివాదము కలిగియుండ కంచిలో (కాంచీపురములో) అది పరిష్కృతమై శాసనబద్దమై యుండెను. ఆ శాసనమును ధర్మాసనానికి కంచినుండి అదేపనిగా తెప్పించిరి. అందిట్లుండెను. నాగరులు, ఊరుజులు, తృతీయజాయులును వైశ్యులు. వైశ్యునికి శూద్రస్త్రీకిని పుట్టినవారు వై జాతీయులు, వైశ్యులకు స్వాధ్యాయయజనదానాధికారాలు కలవు. వారు వ్యాపారము, సేద్యము, పశువుల పోషణము చేయగల