పుట:Andrulasangikach025988mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాసాహసకృత్యముల నొనరించు చుండెడివారు. తలలు, నాలుకలు, గండ కత్తెరచే ఛేదించుకొనుచు భక్తుని సాహసమును చూపినారని శాసనమందు వర్ణింపబడినది." (రెడ్డిసంచిక. పుట 30, 31) ఇట్టివాటినే చంపుడుగుడులు అని యందురు.

శ్రీశైలములో భక్తులు సులభముగా చచ్చుటకు మరొక మార్గముండెను. అది "కనుమారి".

కనుమారి

కనుమారి పదము శబ్దరత్నాకరములోను, ఆంధ్రవాచస్పత్యములోనులేదు. ఈపదమును ప్రయోగించిన కవులిద్దరేయని నాకు తెలిసినంతవరకు చెప్పగలను. పాల్కురికి సోమనాథుడును నాచన సోమనయు నీపదమును వాడిరి. ఇటీవలనే ఈపదచర్చను శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారు "తెలుగు మెరుగులు" అను పుస్తకములో చేసినది చూచినాను. దానినిబట్టి తిక్కన సోమయాజియు ఈపదమును వాడినట్లు తెలిసికొంటిని.

         "కల్లు ద్రావిన పాతకంబది యగ్ని వ
          ర్ణముగాగ గాచి పానంబు సేయ
          గనుమారి యురుకంగ ననలంబు జొర మహా
          ప్రస్థాన మాచరింపగ బాయు" (శాంతి. 1 307)

"కనుమారి యనిన భృగుపతనమని యర్థము. శాంతిపర్వ మూలమున "మరువ్రపాతం ప్రపతన్" అని కలదు అనగా 'నిర్జల ప్రదేశ పర్వతాగ్రాత్ వతనం" అని వ్యాఖ్య.

నాచన సోమన ప్రయోగ మిట్లున్నది.

         "పాయదగు మిమ్ము, కనుమారిబడ బొసంగు
          విషముద్రావుట యోగ్యంబు, వెల్గిలోన
          మునుగుటుచితము, మీరెల్ల కనుగొనంగ
          ఆత్మవిడుచుట చను, నాకు ననుచునడలి" (4 - 56)