పుట:Andhrulacharitramu-part3.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయభూమిక.

ఇయ్యది మాయితిహాసతరంగిణీగ్రంథమాలా ప్రథమ కుసుమము. ఆంధ్రులచరిత్రము 1-2 భాగములను విజ్ఞానచంద్రికామండలివారు ప్రకటించుయున్నారు. మూడవభాగమిది.

ఇందు క్రీ||శ 1250 మొదలు క్రీ||శ 1500 లవరకుగల ఆంధ్రదేశ చరిత్రము వర్ణింపబడినది.

చరిత్రరచనమునకై తమ జీవితమునంతయు ధారవోయుచున్న శ్రీయుత చిలుకూరి వీరభద్రరావుగారే గ్రంథ కతన్‌లు. పాఠకమహాశయులకు వీరు క్రొత్తవారుకారు. వీరి శైలియు విషయశోధనయు నీవఱకే యాంధ్రులు చవిచూచి యున్నారు. పాఠకులకు వీరిం బరిచయముచేయుట ప్రభాకరుం కరదీపికంగొని జూపుటంబోలు.

వీరభద్రరావుగా రీగ్రంథమును మాయితిహాసతరంగిణీ గ్రంథమాలకు ప్రథమకుసుమముగ నొసగి యత్యంతరామణీయకము నాపాదించిరని విన్నవించుచున్నాడ.

సంపాదకుడు.
_____________