పుట:Andhrulacharitramu-part3.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందంజవేయుచున్నది. కానమాకుబ్రోత్సాహ మొనరింపుడని మే మంతగా వాకొనక్కరలేదు.

మాయుద్యమమును వినినతోడ నయాచితులరై మాగ్రంథమాలాస్థానమున కపారమగు ధనదానముంగావించి తమస్వార్థత్యాగముం జూపుటయేగాక వారిమిత్రులగొందరను బ్రోత్సహించి వారివలనగూడ కొంత ధనసహాయ్యమును జేయించిన శ్రీయుత కర్రి చినవెంకటరెడ్డిగారి కనేకవందనములు.

మాగ్రంథమాలకు శాశ్వతపుచందానియమము లేదు. శుభ్రమగు కాగితములమీద చక్కని అచ్చుతో ప్రతిగ్రంథమును ముద్రింపబడుచుండును.

ఇట్లు,
వెలగల వెంకటరెడ్డి,
ఇతిహాసతరంగిణీగ్రంథమాలా కార్యస్థానము,
ఆరవిల్లి, కృష్ణాజిల్లా.


____________