పుట:Andhrulacharitramu-part3.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని ప్రకృతిజ్ఞానశూన్యమగు నాంధ్రప్రపంచపు దుస్థితింబావ సమకట్టి శాస్త్రీయగ్రంథములం బ్రకటించు పరిశ్రమయందున్న విజ్ఞానచంద్రికామండలి యెన్నికొఱతలను దీర్పగలదు?

చరిత్రగ్రంథముల కాంధ్రప్రపంచము త్వరపడుచున్న సూచనలు గనబడుచున్నవి.

దేశభాషాసేవజేయుట దేశస్థుల స్వధర్మనిరతిగదా! మాయితిహాసతరంగిణికూడ తన నెచ్చెలులవలె భాషాసేవ జేయ బయలువెడలినది.

పూలచెట్లనేకములుగలవు. వసంతసమయము. కుసుమ సంపాదన మతిసుకరమని తలచి మేము మాలారచనోత్సుకులమైయుంటగాంచి యాంధ్రనందనకల్పభూజమొకటి మాకు బ్రథమకుసుమము నొసగె. ఆభూజమెద్దియో-తమజీవితమంతయు జరిత్రరచనకై ధారవోయుచు, మాతృభాషా సేవకధీరులగుశ్రీయుతచిలుకూరి వీరభద్రరావుపంతులుగారు. ఆంధ్రుల చరిత్రము మూడవభాగమును, మాకుబ్రథమగ్రంథముగానొసంగి మాగ్రంథమాల కింతింతనరాని సొంపుగూర్చి నందులకనేక వందనములనర్పించి వారికి మాకృతజ్ఞతందెల్పు చున్నారము. మఱియురెండుమూ డాంధ్రదేశ చరిత్రాత్మకములైననవలలు వ్రాయబడుచున్నవి. వెంటనే ముద్రింపబడగలవు.

ఆంధ్రప్రపంచ మీవఱకే యుత్సాహపూరితమై