పుట:Andhrulacharitramu-part3.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహారాష్ట్రాంధ్రదేశములకు నడుమ సరిహద్దులో నోరుగల్లునకు నూటయేబదిమైళ్ళదూరమున నుండెను. హసన్‌గంగూ అల్లాఉద్దీన్ షాహ 1358 వఱకు బరిపాలనము చేసిన పిమ్మట వానిరెండవకుమారుడు మహమ్మదుషాహ సింహాసన మధిష్ఠించెను.

మహమ్మద్‌షాహ ప్రథమ దండయాత్ర

మహమ్మదుషాహ బహమనీరాజ్యపట్టమున కభిషిక్తుండై పరిపాలనము ప్రారంభించినతోడనే యోరుగల్లుపురవరాధీశ్వరుం డయిన అనపోతభూపాలుడును, విద్యానగరాధీశ్వరుం డగుబుక్కరాయలును తమకడనుండి మహమ్మదుషాహ తండ్రి గైకొనినభూభాగముల విడిచిపెట్టవలసినదనియు లేనియెడల డిల్లీచక్రవర్తి సైన్యములతోడ్పాటుతో వానిదేశముపై దాడివెడలి యాభూభాగముల దామే యాక్రమింతుమనియు నతనికడకు రాయబారులను బంపెనట. తనసర్దారులు తనయెడ నంతగా బ్రేమానురాగములు చూపకున్న వారగుటచేతను, తనతల్లి మల్లికాజెహాను మక్కామదీనా యాత్రలు చేసివచ్చుటకై విశేషధనము నొసంగి పంపినందున బొక్కసములో ధనము తఱిగియుండుటచేతను యుద్ధముచేయుటకు గడంగుట యుక్తమైనకార్యము కాదని యూ