పుట:Andhrulacharitramu-part3.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లన్నియు నితని వశముకాగా నాంథ్రదేశాధీశ్వరుం డనుబిరుదమును వహించి మహారాజ్యపట్టమున కభిషిక్తుడై తురకలకు దూరముగా నుండురాజగిరిదుర్గమును (రాచకొండ) రాజధానిగ జేసికొని యవక్రపరాక్రమంబున నోరుగల్లు రాజ్యము నేలుచున్న ట్లీ యనపోతనాయని శాసనములే యుద్ఘోషించు చున్నవి.

బహమనీ రాజ్యస్థాపనము. (1347)

డిల్లీచక్రవర్తి యైనమహమ్మద్‌తుఘ్‌లఖ్‌యొక్క సైన్యాధిపతులలో నొక్క డగుహసన్‌గంగూ అనువాడు తిరుగబడి స్వతంత్రుడై క్రీ. శ. 1347 లో దక్కనుదేశమున మఱొక తురకరాజ్యమును స్థాపించెను. ఆరాజ్యమే తరువాత బహమనీరాజ్యమని చరిత్రమునం బ్రఖ్యాతిగాంచినది. డిల్లీచక్రవర్తి కొల్వుకూటములో జ్యోతిష్కుడుగా నున్నగంగూ యనుబ్రాహ్మణునియొద్ద హసన్ బానిసవాడుగా నుండెను. ఒకనాడు హసన్ పొలము దున్నుచుండగా భూమిలో ధనము గాన్పించినదట! అత డాధనమును దెచ్చి తన యజమానునకు సమర్పింపగా వానిసత్యసంధతకు మెచ్చి యాబ్రాహ్మణుడు వానియెడ దయాళుడై చక్రవర్తితో వానింగూర్చి యనుకూలముగా బ్రసంగించి వానిని పదివేల