పుట:Andhrulacharitramu-part3.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడినవఁట! అచ్చటి జనులు జంబుకేశ్వరుని దైవముగాఁ దలంచి పూజించుచుండిరి. డిల్లీ చక్రవర్తి రాజ్యమును వశపఱుచుకుని యాప్రదేశమునకు 'మాలిక్ నాయబ్' అనువాని నధికారినిగా నేర్పఱిచి చెఱపట్టి యుంచిన యాఱ్గురుని వెంటనిడికొని డిల్లీనగరమునకు వెడలి పోయెనఁట ! చక్రవర్తి క్రూరుఁడై బహఉద్దీనుని హింసపెట్టించి చంపించెనఁట ! ఎప్పుడు డిల్లీ చక్రవర్తి సైన్యములతోఁ దమదేశమును విడిచిపెట్టి వెడలిపోయెనో యానాఁటనుండియు 'మాలిక్ నాయబు' నకు ప్రజలు వశులు గాక ధిక్కరించి పోరాడుచున్నందున వారి శౌర్యోత్సాహములను, స్వాతంత్ర్యప్రీతిని మెచ్చుకుని యచట రాజ్యము చేయుట తనకు సాధ్యము కాదని తలంచి చక్రవర్తికి దేశస్థితి నంతయును దెలియఁజేయఁగా నాతఁడు నట్లే యూహించి తనకడ బందీలోనున్న హరిహరునకు రాజ్యము నొసంగ బుక్కరాజను వానికి మంత్రిగా నియమించి తనకు సామంతులుగ నుండున ట్లొప్పించుకొని వారలను కారాగారమునుండి విముక్తులను గావించి వారిదేశమునకు బంపించి తరువాత మాలిక్ నాయబును తనకడకు రప్పించుకొనియెనఁట ! ఇట్లని మహమ్మదీయ చరిత్రకారులు వ్రాసి యుండిరి.[1] వీర భల్లాణదేవుఁడు

  1. ఇబూబతూతా యను మహమ్మదీయ చరిత్రకారుడు 1333వ సంవత్సరమున హిందూదేశమును చూడవచ్చి తొమ్మిది సంవత్సర