పుట:Andhrulacharitramu-part3.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవసహాయము తక్కువగుటంజేసియు, శత్రుసైన్య మధికముగా నుండుటంజేసియుఁ దుదకు దుర్గమును విడిచి పెట్టవలసినవా రైరి. అలూఫ్ ఖాను హుమయూన్ గజ్జర్ అనువానిని రాజమహేంద్ర ప్రాంత దేశమునకుఁ బాలకుని (గవర్నరు)గా నియమించి తాను డిల్లీనగరమునకు వెడలిపోయెను. ఇది క్రీ.శ 1323వ సంవత్సరాంతమున జరిగినది. రాజమహేంద్రపురము తురుష్కుల వశమైన తరువాత జగరిగిన ఘోరకృత్యముల వర్ణింపఁ బనిలేదు. ఓరుగల్లునకుఁ బిమ్మట నొక్క రాజమహేంద్రపురముననే దేశీయులు మొరాయించి తమ్మెదుర్కొన్నవారగుటచేత ప్రజలకు భీతి గొలుపనెంచి పట్టణము కొల్లగొనుటతోఁ దృప్తి నొందక పురాతన దేవాలయము నొకదాని బ్రద్దలుగొట్టి రాజమహేంద్రపురమున నొక గొప్ప మసీదును గట్టిరి. గవర్నరైన హుమయాన్ గజ్జర్ ప్రేరేపణము చేత షరీఫ్ సాలర్ ఉల్వీయను సేనాపతి పై మసీదును క్రీ.శ 1324వ సంవత్సరమున కట్టించినట్లు తెలుయు చున్నది[1]. అలూఫ్ ఖాను యుత్కలదేశములోని జాజిపురమును ముట్టడించి స్వాధీనము చేసికొని పిమ్మట డిల్లీనగ

  1. Vide District Manual, Page 28. (ఇందునుగూర్చి పారసీభాషలో నొకశాసనము మసీదు ద్వారముపై వ్రాయఁబడినది. ఆ శాసనమిట్లున్నది - మహమ్మదు తుగ్లఖ్ చక్రవర్తి పరిపాలనములో హుమయూన్ గుజ్జర్ కాలమున షరీఫ్ సాలర్ ఉల్వీ యనువానిచేత హిజ్రి 7245 సంవత్సరమున రమ్జాను 20 వదినమునఁ గట్టబడినది.) క్రీ.శ. 1324