పుట:Andhrulacharitramu-part3.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారమునకై అధ్యక్షులగు రామయ్యగారికి బంపగా వారు 'మేనేజరు' లేకుండ సంవత్సరకాలము గడుపుటకైన నొప్పుకొనిరి కాని నాకు బ్రవేశము గలిగింప నిష్టపడరైరి. అంతట నదియు నామేలునకే యని భావించి పరిషత్తున కొక్క నమస్కార మిడి చెన్నపురి విడిచి వచ్చితిని. ఆంధ్రసోదరులారా! నిజముగా దేశముకొఱకు నే నీచరిత్రరచనకు గడంగితినిగాని దీని వలన బుణ్యమును బురుషార్థమును మూటగట్టుకొనవలయు నని గాదు. విద్యాధికులచేతను ధనాధికులచేతను స్థాపింపబడిన పరిషత్తే యింతవఱకు జరిత్రము విషయమై యేమియుం జేయజాలక సంవత్సరములకు సంవత్సరములు గడుపుచుండగా, సామాన్య ప్రజ్ఞకలిగి నిస్సహాయుండనై పెనగులాడుచున్న నేను నాకు దోచిన విధముగా నింత కాలమునకైన నీమూడు భాగముల నాంధ్రప్రపంచమునకు నీరీతిగా నైన సమర్పింప శక్తుడ నైతిని గదా యన్నసంతోషమును బొందుట తక్క నాకు మఱియొండు లాభము గన్పట్టకున్నది. మిత్రులారా! నాగ్రంథములో లోపము లుండవని గాని నాగ్రంథము సమగ్రమైన దనిగాని నేనెన్నడును దలంచి గర్వము పడువాడను గాను. ఉపకరణము లసంపూర్ణములుగాను వివాదాస్పదములుగాను నున్నంతవఱకు జరిత్ర రచనము నాకె కాదు కొమ్ములు తిరిగిన వానికైన భ్రమ