పుట:Andhrulacharitramu-part3.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవతారిక.

ఆంధ్రులచరిత్రముయొక్క మొదటి రెండుభాగములు విజ్ఞానచంద్రికామండలివారివలన బ్రకటింప బడినవి. రెండవ భాగము బ్రకటింపబడినప్పుడు మూడవభాగము నాఱునెలలలో బ్రచురింతు నని చేసిన వాగ్దత్తము నెఱవేర్చుకొనుటకు నాకు నాలుగు సంవత్సరములకాలము పట్టినది. ఈయాలస్యమునకు దగిన కారణములు గలవు. కాని యాచరణము వాగ్దత్తమంత సులభసాధ్యమైనది కాదని యెల్లవారు నెఱుంగు నదియె. తుదకు విజ్ఞానచంద్రికామండలి కాశాభంగమును గలిగింపవలసివచ్చినది. విజ్ఞానచంద్రికామండలివా రీమూడవ భాగమును గూడ బ్రచురించెద మని ప్రకటించి యున్నను నే నీగ్రంథమును వారి కీయక వేఱుగా బ్రకటింప జేసినందులకు నేదియో గొప్పకారణ ముండునని పలువు రూహింప నవకాశము గలదు. కాని నాకును విజ్ఞానచంద్రికామండలికిని గల వ్యవహారము నంతయు, లోకమునకు దెలుపుకొన్నందువలన బ్రయోజనము లేశమాత్రమును లేదు. విజ్ఞానచంద్రికామండలికి నేనెంతయు గృతజ్ఞుడనై యున్నను, ఆత్మీయ గౌరవమును గాపాడుకొనుటకును, మన స్సంక్షోభమునుండి తప్పించుకొనుటకును, స్వలాభముకొఱ