పుట:Andhrula Charitramu Part 2.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గప్పము గైకొనినటుల మహిమలూరు శాసనమునంబేర్కొనబడినది. ఇతని రాజ్యప్రతిపాలకుడు గొల్లపైడి బయ్యపనాయకుని కడగొట్టు తమ్ముడగు బమ్మినాయకుడని (భీమనాయకుడు) పై మహిమలూరు శాసనమునందే పేర్కొనబడియున్నది. ఈ శాసనము శాలివాహనశకము 1139వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1212-18వ సంవత్సరమున వ్రాయబడినది. భీమనాయకుడీతనికి ప్రధానిగను, సైన్యాధ్యక్షుడుగ నుండెను. ఈ యెఱ్ఱసిద్ధిరాజునకు కీర్తినారాయణుడనియు, అయ్యనసింగనియు, ఒరయూరు పురవరాధీశ్వరుండనియు, భుజబలవీరుడనియు, సాహసోత్తుంగుడనియు, నీ మొదలగు బిరుదములెన్నియో చెప్పబడినవి. భావిపరిశోధనముల వలన గాని ఈ తెలుగు చోడులలో నీ పేరులు గలవారికింగల పరస్పర సంబంధ బాంధవ్యములను విస్పష్టముగా జెప్పుట సాధ్యముగాదు. తెలియని వారిని గూర్చి గ్రంథబాహుళ్యముచేసి వ్రాయుటయు నంత మనోహరముగా గన్పట్టదు.

తిక్కభూపతి.

ఇతడు మనుమసిద్ధి రాజుయొక్క కొడుకని తిక్కనసోమయాజి విరచితంబైన నిర్వచనోత్తర రామాయణంబున దెలుపంబడినది. అందు :-

"క. తద్వంశంబున బోషిత
విద్వజ్జనుడహితభుజగ విహగేంద్రుడు ధ
ర్మాద్వైత మూర్తి వరయో
షిద్వర్గస్మరుడు మన్మసిద్ధి జనించెన్.

సీ. భూరిప్రతాపంబు వైరిమదాంధకా
రమున కఖండదీపముగ జేసి,
చరితంబు నిఖిల భూజన నిత్యశోభన
లతకును నాలవాలముగ జేసి