పుట:Andhrula Charitramu Part 2.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టించిన బ్రహ్మశ్రీ రామకృష్ణయ్య ఎం.ఏ., గారి యభినుతోక్తులొప్పిదములనుటకు సందియము లేదు. [1]

  1. ఈ కవియొక్క శైలి తెలియుటకై కుమారసంభవమునుండి యీ క్రిందిపద్యములుదాహరించుచున్నాడను. మదనదహన సమయమున :
    “క. కనికోపించెనొ, కానక
    మునుగోపించెనొ మహోగ్రముగ నుగ్రుడు సూ
    చినగాలెనొ చూడకయట
    మునుగాలెనొ నాగనిమిషమున నరగాలెన్.“

    “క. గిరిసుతమై గామాగ్నియు
    హరుమై రోషాగ్నియుం దదంగజు మైను
    ద్ధుర కాలాగ్నియు రతిమై
    యురు శోకాగ్నియును దగిలి యొక్కట నెగసెన్.“
    రతి సహగమనోద్యుక్తయైచితి జొరజనునప్పుడాకాశవాణి యాత్మహత్య వారించిన శోకాగ్నితప్తయగుచు :
    “క. కరువున బూరితమై లో
    హరసములో గాలునట్టు లంగజు శోకో
    ద్ధురశిఖి రతి తనువిమ్ముగ,
    గరగియు బొడవరక లోన గాలుచునుండెన్.“
    సీ. అలమట సెడియొండె నిలువదు చిత్తంబు
    మూర్ఛిల్లి నెడబాసి పోవ దొండె,
    నూరటగొనియొండె నారదుశోకాగ్ని
    వొరిమాలగొని కాలిపోవదొండె,
    ఘర్మాశ్రుజలములొక్కట గట్టుకొన వొండె
    బొడవంతయు గరంగి పోవ దొండె,