పుట:Andhrula Charitramu Part 2.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా గ్రంథమునందలి దోషములను బరిగణింపక గుణములనే గ్రహించి నా యుద్యమమును ఘనముగా శ్లాఘించి యాంధ్రభాషాపత్రికలు నాకత్యంతమును ప్రోత్సాహమును గలిగించినవి. ప్రథమభాగముయొక్క ద్వితీయ ముద్రణ పీఠికలో నా పత్రికాధిపతులకెల్లరకు నా కృతజ్ఞతను దెలుపుకొనియుంటిని.

జయంతి రామయ్యగారి జాబు

అప్పుడు డిప్యూటీకలెక్టరు హోదా వహించియుండి ఇప్పుడు చెన్నపురిలో నాలుగవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటుగా నున్న శ్రీజయంతి రామయ్య పంతులు బి.ఏ., బి.ఎల్., గారికి నా గ్రంథమును బంపుకొనగా గ్రంథస్వీకారమును జేసిన విషయమును మూడు మాసములకు వెనుక నీ క్రింది జాబు మూలమున దెలిపియున్నారు.
Naidu Peta
Nellore
28.8.1910
Dear Sir,
Please allow me to thank you heartily for the copy of your ఆంధ్రులచరిత్ర which I shall read with great interest. I am more than ordinarily interested in the subject matter of your book, being fellow-worker in the same field.
I received your book some time ago but could not acknowledge in immediately not knowing your correct address.