పుట:Andhrula Charitramu Part 2.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బిరుదమును వాడుకొనుచుండిరే కాని, వారెన్నడు నొరయూరును బాలించినవారు కాకపోవుటమాత్రమేగాక, కన్నులతో జూచినవారుగా గూడనుండరు. కావున నన్నెచోడుడు తన కుమారసంభవములో, __

“క. కలుపొన్నవిరుల బెరుగం
గలుకోడిరవంబుదిశల గలయగ జెలగన్
బొలుచు నొరయూరికధిపతి
నలఘు పరాక్రముడ డెంకణాదిత్యుండన్.“

అని చెప్పికొన్నది పితరులయాచారమునుబట్టిగాని నిజముగ నొరయూరును బరిపాలించుచున్న హేతువుచేత నని యెంతమాత్రమును దలపరాదు. ఇంకనా కాలముననీతడు పాకనాటిని గాని, కమ్మనాటినిగాని, బరిపాలించుచున్న వాడేమో కొంచెము విచారించిచూతము. ఆ కాలమున రెండవ చాళుక్య భీమవిష్ణువర్ధన మహారాజువేంగీదేశమునుబరిపాలించుచుండెను. ఇతడు క్రీ.శ.934 మొదలు క్రీ.శ.945 వరకు రాజ్యపరిపాలనముచేసెను. ఇతనికొడుకు అమ్మరాజ విజయాదిత్యుడు క్రీ.శ.945వ సంవత్సరము డిసెంబరు నెల 5వ తేదీకి సరియైన శా.శ.867వ సంవత్సరము మార్గశీర్ష బహుళ త్రయోదశీ శుక్రవారమునాడు పట్టాభిషిక్తుడయ్యెను. ఇతడు తన సైన్యాధ్యక్షుడైన దుర్గరాజు చేత కమ్మనాటిలో ధర్మపురికి సామీప్యమున నిర్మింపబడిన కటకాభరణమనియెడి దేవాలయమునకు క్రీ.శ.945వ సంవత్సరమున మల్లిపూడి యను గ్రామమును దానముచేసియుండెను. ఈగ్రామమిప్పుడు పేరుమాసియున్నను, శాసనములోనుండి పొలిమేర గ్రామములు వంగవోలు తాలూకాలో గానిపించుచున్నవి. ఇంతియగాక, గుంటూరు మండలములోని కారెంచేడు గ్రామవాసి యగు మాసన్నయను బ్రాహ్మణునకు సైన్యాధ్యక్షుడైన దుర్గరాజుయొక్క ప్రేరణచేత అన్మనంగనూరు, అందెకి గ్రామములలో భూదానములను జేసి యుండెను. కాబట్టి యా కాలమున నాదేశమును బరిపాలించుచుండినవారు రెండవ చాళుక్యభీమ విష్ణువర్ధనుడును, అతని