పుట:Andhrula Charitramu Part 2.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవతారిక

“క. వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ”

జనాదరము

చిన్ననాటనుండియు దేశచరిత్రమునం గల యభిరుచిచేత దానినే యభిమాన విద్యగా నభ్యసించి దేశాభిమానము నన్ను బురికొల్ప నస్మద్ధేశ చరిత్రమును మాతృభాషలో వ్రాసి భాషాసేవయు దేశసేవయు సలుపవలయునన్న సంకల్పముదయించిన మాత్రాన సామర్థ్యాసామర్థ్యముల నించుకయు నాలోచింపక బుద్ధిచాపల్యమును మరల్చుకొనలేక యిక్కార్యమును నిర్వహింప సమర్థులగు విద్యాధికులుపేక్షాపరులై యుండుటచేత నేమయిన గానిమ్మని సాహసించి చరిత్ర రచనకుం గడంగి శ్రీ విజ్ఞాన చంద్రికా మండలివారి యనుగ్రహంబునంజేసి రెండేండ్లనాడు ప్రథమభాగమును బ్రకటించగలిగితిని. తలపెట్టిన కార్యము ప్రాథమిక మగుటచేతనో, కష్టసాధ్యమని యెరింగియుండుటచేతనో, కేవలము నా యెడల గల వాత్సల్యాతిశయము చేతనో,