పుట:Andhrula Charitramu Part 2.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశదిశాభరణాంకుడనియు, నరేంద్రచతురాననుడనియు, రాజబిరుదములు గలవు. ఇతడు రవికుల శేఖరుండని చెప్పబడుటచేత దెలుగుచోడులలోని వాడై యుండవచ్చును. ఇతడు తెనుగున బద్యకావ్యములు వ్రాసి కవిరాజశిఖామణి, కవిబ్రహ్మ అని పొగడ్తగాంచినవాడు. ఇతడు వ్రాసిన గ్రంథములలో నీతిశాస్త్రముక్తావళియును, సుమతీశతకమును మాత్రము గానిపించుచున్నది. కం. శ్రీవిభుడ గర్వితారి
క్ష్మా వరదళనోపలబ్ధ జయలక్ష్మీ సం
భావితుడ సుమతిశతకము
గావించిన ప్రోడగావ్యకమలాసనుడన్.
అని తన నీతిశాస్త్రముక్తావళిని ప్రారంభించెను. ఇతని కవిత కుమారసంభవమువలె గఠినముగాక ద్రాక్షాపాకముగ నతిసరళముగానుండుననియు, భావములు నూతనములై హృదయంగమములుగా నుండుననియు నుడువుచు, బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణయ్య ఎం.ఏ., గారు రెండు పద్యములను ఆంధ్రపత్రికయందు నుదాహరించియున్నారు. [1]

ఉ. ఎత్తినకాలెకాని సిరికెన్నడు నిల్చినకాలనిల్వగా
జిత్తములేదుగాన సిరి జెందినవాడ పరోపకారమా
[2] యత్తతజేయు మెవరైన బదంపడివేడ గొందమన్

చిత్తమకానియిత్త మను చిత్తము వుట్టునె యెట్టివారికిన్.

  1. సాధారణ నామ సంవత్సర చైత్రశుద్ధప్రతిపత్ భానువాసరంబున బ్రకటితంబయిన యాంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 199వ పుటలో నీక్రింది రెండుపద్యములుదాహరించియున్నారు.
  2. ఈ పాదమున గణభంగము గానిపించుచున్నది.