పుట:Andhrula Charitramu Part 2.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

                            మొదటిప్రకరణము

శుశ్రూష చేయుచు విద్యాభ్యాసమొనర్చుచునుండిరి. అట్టివారిలో వైష్ణవ మతోద్ధారకుడును మహాసంస్కర్తయునగు రామానుజాచార్యుడొకడు.

రామానుజాచార్యుడు.

___________

శ్రీవైష్ణవమతము.

ఇతడు ద్రావిడదేశములోని భూతపురి యనునామాంతరముగల శ్రీపెరుంబూదూరను గ్రామమున ఆసూరి కేశవసోమయాజి యను బ్రాహ్మణునకును, కాంతిమతియను భార్యకును, శాలివాహన శకము 940 [1] వ సంవత్సరమగు పింగళ సంవత్సర చైత్రశుద్ధ పంచమీ గురువారమున ఆర్ధ్రా నక్షత్రయుక్త శుభలగ్నమునందు జనించెను. ఆళవందారను నామాంతరముగల సుప్రసిద్ధ వైష్ణవమతాచార్యుడగు యామునాచార్యుని శిష్యవర్గములోని వాడగు శ్రీశైల పూర్ణుడీతని మేనమామ. రామానుజుడు తన పినతల్లియగు ద్యుతిమికిని కమలాక్షభట్టునకును జనించిన గోవిందభట్టుతోడ గాంచీపురమునకు బోయి యాదవప్రకాశునికడ జేరి తన ప్రజ్ఞావిశేషముచేతను, మేధాసంపత్తి చేతను, అత్యల్ప కాలములోనే వేదాంత విద్యారహస్యములనన్నింటిని గ్రహించి గురుబోధమును ధిక్కరించి శంకరుని యద్వైతసిద్ధాంతమును నిరాకరించి విశిష్టాద్వైతసిద్ధాతబోధము మొదలుపెట్టి గురువుతో మతసిద్ధాంతవాదములు గావించి యాతని వైష్ణవ భక్తాగ్రేసరునిగా జేసి తుతకు గురువునకే తాను గురువై యతనిచే బూజింపబడెనని వైష్ణవ మత గ్రంథములు ఘోషించుచున్నవి. ఇట్టు రామానుజుడు శంకరుని మతమును భక్తిప్రపత్తులు లేని వట్టి జ్ఞానమువలన ముక్తిలేదనియు, ప్రపంచము మిథ్యకాదనియు, ముక్తి సమయమున జీవుడీశ్వర స్వరూపము కలవాడయినను బూర్ణముగ నీశ్వరస్వరూ

  1. క్రీ.శ.1018వ సంవత్సరమగుచున్నది. ఇది సరియైనదిగగన్పట్టదు. ఇది చర్చించదగిన విషయము.