పుట:Andhrula Charitramu Part 2.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెప్పబడి యున్నది.. ఇతడు రాయబందీనిమోచకుడని చెప్పుట కాధార మేమియును లేదు. ఆకాలమునకు నీతడు రాయనిరాజ్య మాక్రమిముకొని పరిపాలించుచున్నవాడు, కనుక నితడు తన తండ్రియైన సింగమనాయుడు వహిందిన "రాయబందీవిమోచక" యను బిరుదమును అనపోతానాయుడు వహించియుందును క్జాబట్టి రేచెర్లసింగమనాయుడు, అతని సోదరులగు పద్మనాయక వీరులు ప్రతాపరుద్రుని డిల్లీకి బంపుటకు బూర్వమే శత్రువులను జయించి చెఱనుండి ఇడిపించి యుండవచ్చును. అట్లు కాదేని ఢిల్లీచక్రవర్తిచేత బడినప్రతాపరుద్రుడు బ్రతికి యెట్లు వచ్చును? ప్రతాపరుద్రుని యంతటి వాని చెఱనుండి విడిపించునంతటి యుదారచిత్తుడగు నేని ఢిల్లీ చక్రవర్తి ప్రతాపరుద్రుని మరల రాజ్యమున కభిషిక్తుని గావించియే యుండును. అట్లు జరిగియుండలేదు. కనుక మేమువ్రాసినదే నిజమైయుండవలయును. ప్రతాపరుద్రుడు రేచెర్లసింగనాయుడు మొదలగు వారివలన చెఱనుండి విముక్తుడైనను ఏకశిలా నగరము తురుష్కులయధీనమగుటచేత గోదావరీ తీరమున నెక్కనో నివసించియుండి యత్యల్పకాలములోనే స్వర్గస్థుడై యుండునని మేము తలంచుచున్నాము.

   ప్రతాపరుద్రుడు మరనము నొందిన వెనుక నాంధ్రసామ్రాజ్య భగ్నమై ఏసైన్యాధిపుని స్వాధీనమం దుండినభాగమున కాసైన్యాధిపుడే ప్రభు వని ప్రకటీచి  యాభాగమును బరిపాలనముజేయుట సంభవించెను. ప్రతాపరుద్రుని ధనాగారాధ్యక్షులగు హరియప్ప, బుక్కప్ప, (హరిహరరాజు, బుక్కరాజు) అనువారు లానె గొందికిబోయి తరువాత విజయనగర సామ్రాజ్యస్థాపకులైరి. రేచెర్ల వారయిన పద్మనాయకులు మహమ్మదీయులతో నేకశిలానగర ప్రాంతదేశమున బెనగులాడు చుండిరి. కందుకూరు మొదలుకొని రాజమహేంద్రవరమువఱకును గలదేశమును పంటమహాన్వయు