పుట:Andhrula Charitramu Part 2.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బయట శత్రువరుల నెదుర్కొనుటకంటె దుర్గములోనుండి యెదిరించుట యుక్తమని తలంచి వెనుకకు మరలి యేకశిలానగరదుర్గములో బ్రవేశించిరి. మహమ్మదీయు లుత్సాహపూరితులై యేకశిలాదుర్గమును ముట్టడించిరి. ఇట్లు మాసములకొలది ముట్టడి సాగించిమహమ్మదీయులు తెలపఱులైపోరాడ ఱ్రాంధ్రపురుషసింహులును ప్రాణంబులు తృణప్రాయములుగా నెంచి శాత్రవులు సయితమౌ వేనూళ్ల గీర్తిందునటుల నద్భుతపరాక్రమమును జూపి యుద్ధము సేయుచుందిరి. ఉభపాక్షములయందును వేలకొలది సైనికులు నాశనమైరి. ఉభయ పక్షములును సేనాపతులనేకులు వీరస్వర్గమును జూఱగొనిరి. దుర్గముమత్రము శత్రువులయధీనము కాలేదు. మహమ్మదీయ సైనికుల కుత్సాహము తగ్గెన్. వేలకొలదిసైన్యము నాశనమైనను కోటగోడ రవంత బెల్లయిన నూడిపడక దృడముగానుండేను అక్కాలము మండువేసవికాలమగుటచేత ప్రచండములయిన వేడిగాడ్పులు వీదదొడంగెను. అనేకులు వడగొట్టువడి ప్రానములు గోల్పోవుచుండిరి. కలరా మున్నగు వ్యాధులు శత్రువుల బీడింప దొడంగెను. మహమ్మదీయ సైనికులకు బిఱికితనము హెచ్చి ముట్టడిమాని స్వదేశమునకు మరలిపోవదలంపుగలిగెను. తురుష్కస్కంధావరమున భీత్యావహము లగు వదంతులు వ్యాపింప జేయుబడుచుండెను. అదివఱకు నెలనుండి ఢిల్లీసమాచారములు తెలిఅయకుందుటచేత ఆలూఫ్ ఖాను మిత్రులును, డెమాస్కస్ పురవాసియైన షెకుండా యను నాతడును, ఓబీ డను ప్రైసిద్ధకవిశిఖామణియును, ఢిల్లీచక్రవర్తియైన గ్యాస్ ఉద్దీను తుములల్లా మరణము జెందెననియు, ఢిల్లీనగరమున విప్లవము సంబవించెననియు వదంతులు పుట్టించిరి. అంతటితో దృప్తినొందక ముద్రాధికారియైన్ మలిక్ కాఫర్, మఱియొక యధికారియైన మలిక్ తుగ్గే యనువారల కడకుబోయి ఢిల్లీ సమాచారముల జెప్పిరి. మఱియు సింహాసమనముకై తనకుంగల హక్కును వారు నిరాకరింపవచ్చునని సంశయించుచు అలూఫ్ ఖాను తమ్మును విడిచిఫోక నిశ్చ