పుట:Andhrula Charitramu Part 2.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మును జేసి మలిక్ కాఫుర్ తనప్రభువును బంపించె నని చెప్పుదురు. అల్లా ఉద్దీను క్రీ.శ.1316 లో జనిపోయెను. అల్లాఉద్దీను చనిపోయినతోడనే యతని పెద్దకుమారునికన్నుల నూడబెఱికి వాని జెఱ నుంచి యాతని తమ్ముడైదేండ్లవాడొక డుండగా వానికి బట్టము గట్టి తానే పరిపాలనము సేయ ప్రారంభించెను. కాని వాని పరిపాలన మొల్లక వాని సేవకులే వానిని మట్తుపెట్టిరి. అల్లాఉద్దీనును నాలుగవకుమారుడు ముబారిక్ అనువాడు క్రూరుడై తనసోదరుల నందఱను జంపి పట్టాబిషిక్తుడైయ్యెను. ఇతడు 1318 దవ సంవత్సరమున మహారష్ట్రదేశముపై దండెత్తివచ్చి దేవగిరిదుర్గమును ముట్టడీంచి హరిపాలదేవుని బట్టికొని మహాకొర్రుడై బ్రదికియుండగానే వాని చ్చర్మ మొలిపించి చంపించి యారాజ్యమును దనసామ్రాజ్యము లో గలుపుకొనియెను. ఢిల్లీనగరమున ప్రవేశింపగానే ఖుశ్రూ యనాధిపతి యా వీరుని దల నఱికివైచి తాను రాజ్యారూఢుడయ్యెను. ఈ ఖుస్రూ యనువాడు ప్రచ్చన్నవేషముతో నున్న హిందువగుటచేత దురుష్కుల ద్వేషింప నారంభించెను.

   అతని యనుయాయు లందఱును ఢిల్లీనగరములోని మసీధులలో విగ్రహములను బ్రతిష్ఠింప సాగిరి. ఢిల్లీనగర మంతయు నల్లకల్లోలముగా నుండెను. ఆసమయమున బంజాబుదేశమునకు సుబాదారుగా నున్న గజీబేగుతుఫ్ లఖ్ అనువాడు వచ్చి ఖుస్రూను జంపి ఢిల్లీనగరము స్వాధీనము జేసికొని గ్యాసుర్గిమ అను పేరుపెట్టుకొని రాజ్యపరిపాలనముచేయ ప్రారంభించెను.

భాషాభివృద్ధి.

  ప్రతాపరుద్రచక్రవర్తి యాబాల్యకవితార సజ్ఞడును, విద్వద్గోష్టీ ప్రియుండును నగుటచేత దనయాస్థానమున విద్వన్మహాకవుల ననేకులను నిలిపి పోషింపుచువచ్చెను. అట్టివారిలో విద్యానాధమహాకవి యగ్రగణ్యుండని చెప్పందగును. అమ్మహాకవి ప్రతాపరుద్ర యశోభూషణంలను నలంకార