పుట:Andhrula Charitramu Part 2.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రుల చరిత్రము.

సంవత్సరపాదాయము 1002 గండగోపాల మాడలలోను 240 మాడలు వేగవతీనదికి దక్షిణపుటార్జున నొక పుష్పోద్యానవనమును నిర్మించి నానావిధ ఫలౌష్పజాతి వృక్షములను నాటుటకును, దాని సంరక్షణంచేసెడి నౌకరుల జీతముకొఱకును, 360 మాడలు దేవుని నిత్యకైంకర్యాదుల కొఱకును, 382 మండపము లాదిగా గట్టడములకొఱకును వినియోగించు నిమిత్తము దానశాసనమును లిఖించెను. ఈ శాసనమునుబట్టి కాంచీపురము గూడ నాంధ్రసామ్రాజ్యమున జేరియున్నదని విస్పష్టమగుచున్నది.1

అల్లా ఉద్దీను మరణము,ఢిల్లీలోఅల్లకల్లోలములు

  ప్రతాపరుద్ర చక్రవర్తి దక్షిణ దిగ్విజయ యాత్రలు ముగించి దేశమున శాంతి నెలకొలిపె రామరాజ్యముగ నాంధ్రసామ్రాజ్యమును బరిపాలనము సేయుచుండెను. అల్లాఉద్దీను చక్రవర్తి సైన్యాధ్యక్షుడైన మల్లిక్ కాఫురునెడ పక్షపాతమును జూపుచు మిక్కిలి యనురాగము గలిగి యుండుటచేత నీతనియెడ ననేకుల కసూయ జనించెను. చక్రవర్తికిని వాని భార్యాపుత్త్రాదికులకొను బలవర్విరోధ మేర్పడియెను. మల్లిక్ కాఫుర్ వరలనుబట్టి చెఱలో బెట్టేను. మూర్జరము చక్రవర్తియధికారమ్ను దిరస్కరించెను.చితొడ్ గడ  మను రాజపుత్త్ర సంస్థానము స్వాతంత్ర్యము నొందెను. దెవగిరిలో రామచంద్రదేవుని యల్లు డగు హరిపాలదేవుడు మహారాష్ట్రమునుండి తురుష్కులను దఱిమెను. ప్రతాపరుద్రచక్రవర్తి మరల బురెకొని బలఫంతుడై తనత్ఫ్ సమానుడై యెప్పుచుండెను. ఈసమాచారములను విని ఢిల్లీచక్రవర్తి దు:ఖముతో గ్రుంగి చేయునది లేక వ్యాధిగ్రస్తుడై యుండ విషప్రయోగ

  1.Epigraphia Indica, Vol.VII, No>18, Arulala perumal Inscription of the Time of Prataparudra