పుట:Andhrula Charitramu Part 2.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేయుచుండగా బరాభూతు లయిన పాండ్యరాజకుమారులను దోడుచేసి కొని కెరళదేశాధీశ్వరుండైన రవివర్మ క్రీ.శ. 1313-14-గవ సంవత్సరమున గాంచీపురమును రెండవమాఱు ముట్టడించి మనుమగండగోపాలుని బాఱద్రోలి రాజ్య మాక్రమించుకొని కాంచీపురమున పట్టాభిషిక్తుడయ్యెను. ఈవృత్తాంఅమును విని ప్రతాపరుద్రుని మహాప్రధానులలో నొక్క డగు ముప్పిడినాయకుడు దాక్షణాత్యులను కాంచీపురమునుండి తఱుమగొట్టుటకై నియోగింపబడియెను. ఈముప్పిడినాయకుని తండ్రి నాగినాయుడనియు, తల్లి గంగసానమ్మ యనియు, కందుకూరు సీమలోని గుడ్లూరు వీలకంఠేశ్వర స్వామివారి యాలయసమీపమునం బడి యున్న యొక శిలాశాసనముం బట్టి దెలియుచున్నది. ఈసీమయందతని దానశాసనము లనెక ములు గలవు. ఈకమ్మసేనాధిపతి యైన ముప్పిడినాయకుడు కాంచీపురమును ముట్టడించి పాండ్యకేరిళులతోడ ఘోరయుద్దము చేసి రవివర్మ యాదిగాగల రాజకుమారవర్గమును బాఱద్రోలి కాంచీపురమును బ్రవేశించి మాన వీరుని పట్టాబిషిక్తుని గావించెను. శ్రీమన్మహామండలేశ్వర మనుమగండ గోపాలదేవ చోడమహారాజే మానవీరుడని పేర్కొనంబడియె నని తొచుచున్నది. కాంచీపురము కొంతకాలమునుండి విక్రమసింహ (నెల్లూరు) పురాధిపతులయిన తెలుగ్తుచొడులచే బరిపాలింపబడుటచేత మానవీరుడు తెలుగు చొడులలోని వాడుగానే పరిగణింప బడవలసియును. ముప్పిడినాయకుడు క్రీ.శ. 1319 వ సంవత్సరము జూను నెల 11అ తేదీని కాంచీపురములో నున్నట్టి ఆరుళాల పెరుమాళ్ల దేవాలయమునకు దానధర్మములను గావించి శాసనము వ్రాయించెను. పెయ్యూరు కొట్టమునాటిలో "అయిరదేరి 'గుమ్మడిపూడ్ పాలెములతో పెయ్యూరు గ్రామమువలనను, కచియూరు నాటిలోని పాండైసాక్క మను గ్రామమువలనను వచ్చెడి