పుట:Andhrula Charitramu Part 2.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"పాండ్యదళనిఫల" "కంచికతాటచూరికార" అనుబిరుదుల నొసంగెనట! ఇతడు పాండ్యరాజును జయించినట్టు సింగబూపాలీయ మను గ్రంధమునందలి యీక్రింది శ్లోకమువలనం గూడ దెలియుచున్నది.

శ్లో. యస్యాసిధారామార్గేన దుర్గే నాసి రణ్మాణే
   పాండ్యరాజగజానికా జ్జయలక్ష్మీరుపాగతా.
   ఖడ్గనరాయణే తస్మిన్ భవతి శ్రీ రితిస్థిరా
   భూరభూ త్కరిణీ వశ్యా దుష్టరాజగజాంకుశా."
  మఱియు శ్రీవంకటగిరివారి వంశావళియందు
"చ.వెలయ బ్రతాపరుద్రవిభు వీరభటావళి ఛూడ వాణిలో
   బలమున గుంత మందుకొని చయ్యన వచ్చి గజంబు
   నొర్చినోర్బల మధికంబుగా నెడబైకొని తా జయలక్ష్మీ
   చేకొనన్
   గెలిచెను బాండ్యరాజగజకేసరి దాచయశౌరి పాండ్యులన్."

    అని వ్రాయబడిన పద్యమువలనను రేచెర్లనాచానాయుడు పాండ్యులను జయించె ననుట ధ్రువపడుచున్నది. ప్రతాపరుద్రునిని పేరిటిశాసన మొకటి తిరుచునాపల్లెలొ జంబుకేశ్వరాలయములో నుండుటచేత నీదండయాత్రలో బ్రతాపరుద్రుడు కూడ నుండె నేమో యని సందియము కలుగుచున్నది. ప్రతాపరుద్రుడు స్వయముగా దిక్షిణేఇగ్విజయాత్ర చేసినను చేయక పోయినను ఇతడు సైన్యముల బంపి పాండ్యులను జయించినది వాస్తవమనుటకు సందియము లేదు.

ముప్పిడినాయకుడు రవివర్మను జయించుట

 విక్రమసింహపురాధిపతి యైన నల్లసిద్ధిరాజునకు జ్యేష్టకుమారుడైన మనుమగండ గోపాలదేవ చొడ మహారాజు కాకతీయ సైన్యాధిపతుల సాహాయ్యముతో గాంచీపురమును మరల స్వాధీనముచేసికొని పరిపాలనము