పుట:Andhrula Charitramu Part 2.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జెప్పబడినది. ఈజుట్టమ గొంకారెడ్డి ప్రతాపరుద్రుని కారసపుత్రుడై నదియు, మఱియొక పుత్త్రుడైనదియు, భావి పరిశోధనములవలన దెలిసికొనవలసియున్నది. ఎట్టిపుత్త్రుడైనను క్రీస్తుశకము1313 వ సంవత్సరప్రాంతమున ములికినాడు గండికోటసీమలను బరిపాలనము చేయుచుండె నని యాప్రదేశములోని వాని శాసనములే వేనోళ్ల జాట్చున్నవి.

ప్రతాపరుద్రుడు పాండ్యరాజులను జయించుట

  మహమ్మదీయులు ప్రతాపరుద్రునిపై దండెత్తివచ్చినా రనియు, ప్రతాపరుద్రుడు శత్రువులతో భోరాడలేక సంధిచేసి కొన్నాడనియు విన్నతోడనే పూర్వవైభమును మనస్సు నందుంచుకొన్న వీరపాండ్య విక్రమపాండ్యసుందరపాండ్య కులశేఖరపాండ్య పరాకరమపాండ్యులన్ నీయైదుగురు పాండ్య రాజులు కాంచీపురమును ముట్టడించి చోడరాజైన మనుమగండ గోపాలునిచటి నుండి పాఱద్రోలి యాపట్టణ మాక్రమించుకొనిరి. మనుమగంద గోపాలుడు ప్రతాపరుద్రచక్రవర్తికి గప్పము చెల్లించు సామంతప్రభువు గావున ప్రతాపరుద్రచక్రవర్తి పక్షమున నతని మహామంత్రులలో నొక్కడును, ప్రతినిధి పాలకుండును, సైన్యాధ్యక్షుడు నగు ముప్పిడి నాఅకుడను కమ్మసేనాని పద్మ నాయిక వీరుడైన రేచెర్ల యెఱ్ఱదాచానాయని పాండ్యుల మీదికి బంపించెను. ఎఱ్ఱదాచానాయుడు కాంచీపురసామీప్యమునకు బాండ్యులతో ఘోరయుద్ధముచేసి వారలను జయించి గజతురగచ్చత్రచామరాజ దోలికాదులు పెక్కులు గ్రహించుటయుగాక శిరోభూషన మగు నఱచేతి వెడల్పుగల యొకగొప్పపచ్చను ఒకస్వర్ణమయసింహాసన మును దీసికొని వచ్చి తాను దెచ్చిన ధనకనకవస్తువాహ నాదులు నమూల్యరత్నాదులను ప్రతాపరుద్రునకు సమర్పించెను. ప్రతాపరుద్రుడు మెచ్చి వానికి "సంహ