పుట:Andhrula Charitramu Part 2.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సైన్యము నెదుర్కొనుటకై లక్షసైన్యమును బంపెను. ఈ సైన్యమున కంతకును ప్రతాపరుద్రచక్రవర్తి సోదరుడగు అన్నమదేవు డధ్యక్షుడుగ నుండేను. అశ్వసైన్యమున కధిపతి యైన మారయసాహిణియు గజహెణిమేచయ నాయుడు నీతనికి దోడుగా నుండిరి. ఇంకను కమ్మసేనానులు వెలమసేనానులు పెక్కండ్ర సాహాయ్యముతో అన్నమదేవుడు మలిక్ కాఫర్ నెదుర్కొన గోదావరీతీరమువఱకు బోయి రేవుల నన్నిటిని గాచుకొని యుండెను. మలిక్ కాఫర్ ఆంధ్రదేశమును బ్రవేశించినతోడనే దేవాలయంబుల గూలంద్రోయుచు, పల్లెలను పట్టణములను దోచుకొని తగులబెట్టుచు భూమియు నాకాశం నొక్కటే జ్వాలగా నగ్నికి బ్రవహింప జేయుచు వచ్చుచుండ బ్రజలు బీతావహులై స్వస్ధలమ్లను విడనాడి యరణ్యప్రాంతములకు బాఱిపోవుచుండిరి. ఇట్లు సాధువులు నిరపరాధులు నగు ప్రజలను సంక్షోభ పెట్టుచు మలిక్ కాఫర్ గోదావరీనదివఱకు వచ్చెను. అప్పు డుభ్యసైన్యములకును ఘోరమైన యుద్ధము ప్రారంభ మయ్యెను. మహమ్మదీయ సైనికులు గోదావరి దాటి రావలయు నని యెన్నెన్నో ప్రయత్నములను గావించి భగ్నమనోరధులైరి. అనన్యసామాన్య క్షాత్త్రతేజంబు వహించి విక్రమసింహంబులవలె విజృంంబించి మొక్కవోని పౌరుషముతోడ శాత్ర్రవ వీరుల మార్కొని హిందూవీరవరాగ్రణులు పోరాడి శాత్రవులచే సయితము పలు ప్రకారంబుల గొనియాడబడుచుండిరి. ఉభయపక్షములలోను వేలకొలది సైనికులు రణభూమికి దమ ప్రాణంబు లర్పించి స్వామిభక్త్రిని ప్రకటించిరి. మహమ్మదీయులు గోదావరీనదిని దాటి రాలేకపొవుటయు గాక తమస్థానంబుల సుస్ధిరచిత్తులై నులువం జాలక పోయిరి. హిందువులు గొదావరీనదిని దాటి వచ్చి పైబడగా శత్రువులయొక్క మధ్యభాగ్తం విచ్చిపోయెను. అంతట హిందూరాహుత్తులు శత్రువులం దఱిమిరి. ఒకభాగ మిట్లు పాఱినతోడనే తక్కిన మహమ్మదీయసేనానులు కూడ సుస్ధిరత్తులై నిలువంబడి పోరాడ