పుట:Andhrula Charitramu Part 2.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వైపునకు బఱపెను. అల్లాఉద్దీను విద్యావిహీనుండును క్రూరుడును విషయాసక్తుడు నైనను మంచిసమర్ధుడు గనుక నేర్పరులయిన చారులన్ బంపి త్రైలింగదేశము నేలుచున్న ప్రతాపరుద్రుని రాజ్యాంగబలముయొక్క శక్తిని రాజ్యతంత్రరహస్యములను దెలిసికొని త్రైలింగ్యసామ్రాజ్యమును ఢిల్లీ సామ్రాజ్యమును గలుపుకొనవలయు నని సంకల్పిచెను. ఇట్టి సంకల్పమును నెఱవేర్చగల సమర్ధుడు తన కడ నున్న బానిసవాడగు మలిక్ కాపూర్ కన్న మఱియొక్కడు లేడని యాతని సైన్యాధ్యక్షుని గావించి త్రిలింగ సామ్రాజ్యమును జయింప బంపి రాజపుత్త్రసింహమును చితోడ్ గడమున కధిపతియు నగు బీమసింహుని రాణి పద్మిని నపహరింప గొరి త్తమకంబుతో దాను చితోడ్ గడముపైకి దండెత్తి పోయెను.

మలిక్ కాఫూర్ ప్రధమదండయాత్ర

   బానిసవాడయ్యును మలిక్ కాఫూర్ ధైర్యసాహసారి గుణవిశేషంబులచే మేటి యోధు డనిపించుకొని ఢిల్లీ చక్రవర్తి యనుగ్రహమునకు పాత్రుడై సైన్యాధ్యక్షపదవిని వహించి ప్రచండశాసనుడై యాసేతు హిమాలయ మేకచత్రాధిపత్యముగా రాజ్య మేలవలయు నని యువ్విళ్లూరుచున్న వాడగుటచేత పదివేలగుఱ్ఱపుదళముతోడను నలుబడివేల పదాతివర్గము తోడను త్రిలింగ దేశముపై దండెత్తివచ్చెను. ఇయ్యది క్రీ.శ.1303 వ సంవత్సరాంశమున జరిగెన్.  క్రీ.శ.1394 గవ సంవత్సరమున జయింపబడినది మొదలుకొని దేవగిరి నేలు రామచంద్రదేవుడు ఢిల్లీచక్రవర్తితో మైత్రి కలిగియుండెను గావున దురుష్కసైన్యము లాతని రాజ్యమునకు నెవిధమైన నష్టము గలిగింపనందున రామడేవుడ్ తురుష్క సైన్యమునకు దోడ్పడియెను.  మహమ్మదీయులు తనదేశంపై దండెత్తి వచ్చుచున్నారనెడు బయంకర మైన వార్త చారులవలంహ విని ప్రతాపరుద్రచక్రవర్తి భయకంపితుడు గాక మంత్రిసాంటవర్గముతోడ్ నాలోచించి యాశత్రన