పుట:Andhrula Charitramu Part 2.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోరెను. ప్రతాపరుద్రుడు మొదలగు హిందూరాజులు పంపిన సైన్యములు దేవగ్రికి వచ్చుచుండెను కాని యింతలో నదివఱకు కోటలో ద్రోయబడిన బస్తాలు ధాన్యపుబస్తాలు గాక ఉప్పుబస్తాలని తెలిసికొనంబడియెను. భోజన పదార్ధములు గూడ చాలకయుండెను. ఈ హెతువుచేత రామదేవుడు సంధి చేసికొనుటకు తప్ప దయ్యెను. అప్పుడు 600 మణుగుల ముత్యములను వేయి వెండినాణెములను రెండువిలువగల నగలును 4000 పట్టుపీతాంబరములును బహుమానముగ నిచ్చుటయే గాక కొంతదేశము నొసంగి ప్రతిసంవత్సరము కప్పము చెల్లించుటకు నొడంబడినందున నా మహమ్మదీయసేనాపతి ముట్టడి విడిచిపట్టి ఢిలీనగరమునకు మరలి పోయెను.

అల్లాఉద్దీను చక్రవర్తి యగుట.

   అల్లాఉద్దీను ఢిల్లీకి మరలిపోయిన తరువాత వృద్ధుడై డెబ్బదియేండ్లు వయస్సు నిండిన పెద్దతండ్రిని  జంపించి క్రీ.శ.1296 వ సంవత్సరములో సింహాసన మెక్కెను. సుల్తానునకు సైన్యమును బంపి జిలాలుద్దీనుకొడుకులను జయించెను. సింధుదేశమునుండి మంగోలియాజాతివారిని దఱుమగొట్టెను. అధికసైన్యములను బంపి సురష్ట్రము లేక ఘూర్జరమును కైవశము జేసికొనియెను. ఇచ్చటనే మలిక్ కాఫూర్ అనువానిని బానిసగ బట్టుకొని పోయెను. ఇతడే తరువాత అల్లాఉద్దీను సైన్యమున కధ్యక్షుడై ప్ర్రసిద్ధుడయ్యెను. మంగోలియాజాతివరనేకులు దాడివెడలివచ్చి ఢిల్లీనగరమును సమీపింపగా వారలతో ఘోరయుద్ధముచేసి వారిని పాఱద్రోలెను. ఈవిజయముతో నుప్పొంగిన వాడై భరతఖండమున నేకమతము నేకసామ్రాజ్యము నెలకొలుపవలయునని యూహించెను గాని హిందూదేశమున మాతముతో బ్రసక్తి కలుగ జేసికొనుట ధారుణీశ్వరుల కపాయకర మని తెలిసికొని యేకమతస్థాపన మనుదానిని విడిచిపెట్టెను. మంగోలియాజాతివారివలన నింఇఅ నపాయము లేదని తెలిసి కొన్న తరువాత తనదృష్టిప్రసారమును దక్షీణహిందూస్థానము