పుట:Andhrula Charitramu Part 2.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నగరమున బహుస్వలసంఖ్య కలదిగ నుండెను. సైన్యమును సమకూర్చుకొని యెదుర్కొనుటసరైన నవకాశం దక్క దయ్యెను మరికొంద ఱీతడు రాజధానీనగరమున లెడని చెప్పెదరు. ఏది నిజమైనను అల్లా ఉద్దీను దండేత్తి వచ్చనన్నమాట విన్నతోడనే యెట్లెటో నాలుగువేలసైన్యమును పోగు చేసికొని మహమ్మెదీయ సైన్యాధిపతికిని దేవగిరి దుర్గముంకున్ నడుమ నిలిచి శత్రువుల నడ్డగింప బ్రయత్నించెను గాని విశేషకాల మట్లేదుర్కొని పోరాడటంవలన బ్రమారము గల దని యెఱింగి యిప్పటికి భోజనపదార్ధములచే దుర్గము నింపబడియ; నని తెలిసికొన్న వాడగుటవలన వెంటనె వెనుకకు మరలి దేవగిరి దుర్గములొ ప్రవేశించెను. అంతట మహమ్మదీయులు పట్టణము నంతయు దోచుకొని కోటను ముట్టడించిరి. ఇంతయు గాక అల్లాఉద్దీను చక్రవర్తిసైన్య మింకను వెనుకనె యున్న దనియు, ఈవచ్చిన సైన్యము దానిలో నొకభాగ మనియు వదంతి కలుగజేసెను. రామదేవుడు మూర్ఖముగా నెదుర్కొనుటవలన లేశమాతమును బ్రయేజనము లేదని యూహించి సంధికై ప్రయత్నము చేసెను. అల్లాఉద్దీను తనసైన్యముయొక్క బలహీతనను దాను బాగుగా నెఱింగినవాడు గావున విశేషముగా సువర్ణము నొసంగినయెడ్ల ముట్టడిని విడిచిపెట్టి పోదు నని తెలియజేసెను. ఇంతలో రామచంధ్రదేవుని కొడుకు శంకరదేవుడు కొంతసైన్యనును గూర్చుకొని తండ్రికి సహాయపడుటకై వచ్చుచుండెను. దానిని గనిపెట్టి వేయిసైనికుల దుర్గముకడ నుంచి అల్లాఉద్దీను తక్కిన సైన్యముతొ శంకరదేవుని నెదుర్కొని తనను గాని హిందువులసంఖ్య యధికముగా నుండుటద్చేత మహమ్మదీయులు నిలువలెక వెనుకకు మరలచుండిరి. ఇంతలో కోటను ముట్టడించి యున్న సైనిఉలు వచ్చి కలిసికొనిరి. ఈసైన్యమును జూచి హిందువులు ఢిల్లీనగరమునుండి క్రొత్తగ సైన్యము వచ్చిన దని భయపడి పలాయను లైరి. రామచంద్రదేవుడు సంధి చేసికొనగొరగా మహమ్మదీయ సేనాపతి యెక్కువధనమును