పుట:Andhrula Charitramu Part 2.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చుండిరి. అయినను మహమ్మదీయులలో నొకవంశమునకు బిమ్మట మఱియొక వంమువారు రాజ్యమునకు వచ్చి క్రూరం లైనదండోపాయములచే సాధువులయిన హిందూప్రజలను హింసించుచు ఢిల్లీనగరమున బరిపాలనము సేయుచు సాంరాజ్యమును విస్తరింప బ్రయత్నించుచుండిరి. బలవంతు లయిన యిట్టి శాత్రవులను గూర్చి యించుకయు దలపోయక శాస్త్రవ్యాసంగములతోడను విద్వత్పండితగోష్ఠులతోడను కాలమును వెళ్లబుచ్చుచు రామదేవుడు స్వరాజ్యసంరక్షణమునం దెమరి యుండెను. ఈతని రాజ్యమ్నకు దిగువను ప్రతాపరుద్రునిరాజ్యముండుటచేత నీతడును ఉత్తరహిందూస్థానమునందు జరుగుచున్న చర్యలను పరికింపక మౌనధారణము వహించి తన్ను గట్టుకొన ద్రాళ్లు తానే దెచ్చుకొన్నవాడయ్యెను. మహమ్మదీయులవలన తనకు నపకృతి కలుగు నున్నతలంపు లేనివాడగుటచేత సరిహద్దున నుండు దుర్గములను బలపఱచుమొనుటకు బ్రయత్నింపక రాజధానీదుర్గమును మాత్రమె బలపఱుకుకొని యుండెను. అధికప్రఖ్యాతి గాంచిన వీరు లయిన సేనానాయకులెనెకు లీతనిరాజ్యమున నుండిరి. అప్పుడు జలాలుద్దీనను ఖిల్జీవంశస్థుడు ఢిలీసింహాసన మాక్రమించుకొని పరిపాలనము సేయుచుండెను. ఈతడు వృద్ధుడగుటవ్ల రక్తమును బ్రసరింప జేయుటయందు వాంచలేనివాడగనుండేను. అయినను నిరక్షరకుక్షియు, క్రూరుడు నైన యీతని సోదర పుత్త్రుడు అల్లాఉద్దీన్ సైన్యాధ్యక్షుడుగ నుండెను. ఇతడు బుందేలుఖండు (Bundelkhand) మాళస్వదేశములపై దండయాత్ర వెడలి వానిని జయించి యింకను మహాయుద్దములను జేయ నభిలాష కలిగియుండెను.

అల్లాఉద్దీను దక్కను దండయాత్ర.

     ఇత డెనుబడివేల యాశ్వకసైన్యముతో గంగాతీరమునందలి కురా యను ప్రదేశనుండి బయలుదేఱి విదర్బాదేశము మీదుగా వచ్చి యాకస్మికముగ దేవవగిరిని సమీపించెను. అప్పుడు రామదేవుని సైన్యము రాజధానీ