పుట:Andhrula Charitramu Part 2.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప దు నా లు గ వ ప్ర క ర ణ ము.

                             ---

శ్రీవీరప్రతాపరుద్ర దేవచక్రవర్తి పాలనము.

మ హ మ్మ దీ యు ల దం డ యాత్ర

                       ------
   ప్రతాపరుద్రునకు సమకాలికు డైనరామచంద్రదేవుడు దేవగిరిరాజధానిగా మహారాష్త్ర కుంతల దేశములను బరిపాలనము సేయుచుండెను. దక్కను దేశమును బరిపాలనము సేయుచుండిన స్వతంత్రరాజులలో ప్రతాపరుద్రుడు తరువాత నీతడు మిక్కిలి బలాఢ్యుడు డని చెప్పుదగినవాడుగ నుండెను. ఈతడు క్రీ.శ.1271 మొదలుకొని క్రీ.శ.1350 దవ సంవత్సరమువఱకు బరిపాలనము చేసెను. ఈయాదవరాజునకును ప్రతాపరుదునకును మనస్పర్ధలు గలిగియుండియు నుభయులు బలాఢ్యు లగుటచేత నొందొరులను జయించుకొను ప్రయత్నమును విదిచి మౌనము వహించి మిన్నకుండిరి ఇట్లుండ, నుత్తరహిందూ స్థానమున ననెకం లైన మార్పులు రాజ్యాంగమున జరుగుచుండెను. అదివఱకు నూఱు సంవతరముల క్రిందట ఢిల్లీసామ్రాజ్యమును విస్తరింప జేయుచుండిరి.  రాజపుత్రులనెకులు బహుసంవత్సరములు మహమ్మెదీయులతో బోరాడి పోయినవారు పోగా హతశేషులయినవారు పర్వత ప్రాంతభూములకు నెడారులకు బోయి వేఱ్వేరుసంస్థానములను స్థాపించి మహమ్మదీయులకు వశ్యులు గాక పౌరుషపరాక్రమములు నెఱపు