పుట:Andhrula Charitramu Part 2.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"సీ. శనివాసిద్ధి సజ్జనపారిజాతంబు
           వరదాత యాదిత్యవారభోగి
      మాధవీరమణుండు మాయావిమొడుండు
           మాళవీప్రియభర్త మహెరయశుడు
      పల్లెంబనాయకుం డెల్ల వేల్పులరాజు
           కనపవేంటల వేడ్కకాండ్ర బర్త
     కత్రకాలాస్వామి కరుణాపయోరాశి
         పుణ్యకీర్తను డైన ప్రోలియయ్యా
తే.గీ. మంచు కుంచాల గొలువంగ ఆయాలేళ్ల
       బట్టి కట్టంగ నేర్చిన బాస వెల్లి
       భైరవునితొడి జోడు మైలారుదేవ్గు
      డోరుగంటినివాసి మే లొసంగు గాత. "

  ఇట్లా భైరవుడు మొదలగు దేవతల మహొత్సవములు గాక యేక శిలానగరమున నాంధ్రదేశమునను జరుగు దేవతామహొత్సవమ్లలో ఏకవీరా మహాదేవియొక్క మహోత్సవము మిక్కిలి ప్రశంసనీయమైనది.  జమదగ్ని మహాముని భార్యయు పరశురాముని తల్లియు నగు రేణుకాదేవియె ఏకశిలామహాడెవి యను పేర నాంధ్రులచే గొలువబడుచుండెను.  ఏకవీరామహా దేవి యాదిశక్తియొక్క యవతార మని యాకాలమున భక్త్యావేశముతొ సమస్త జనులచే నారాధింపబడుచుండెను. ఉత్సవదినములలో ఏకవీరామహాదేవి యెదుట బెనివీలు పరశురామునికధలు పాడుచుండిరి.
వీరపురుషారాధనము.
  మఱియు నాకాలమున వీరపుర్రుషుల నారాధించు నాచారము గలదు. యుద్ధములయందు మహాశూరుడై పోరాడి ప్రాణములు కోల్ఫోయినవారిని