పుట:Andhrula Charitramu Part 2.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్రుల చరిత్రము


----


మధ్య యుగము


----


మొదటి ప్రకరణము.

----


పండ్రెండవ శతాబ్ద స్థితి.

దక్షిణ హిందూస్థానమున మహారాష్ట్ర కర్ణాట ద్రావిడాంధ్ర కాళింగులు సుస్థిర మైన యేక సామ్రాజ్యమును నెలకొలుప వలయునన్న సంకల్పముతో దమతమ యావచ్ఛక్తులను వినియోగించి దక్షిణాపథము నంతయు భయంకరమైన యుద్ధరంగముగ జేసికొని వీరాధివీరులై పోరాడుచున్న రాజకీయవాతావరణమును; రాజ్యాధిపత్యములను వహించిన చక్రవర్తులు మహారాజులు సామాన్యముగ శైవమతాభిమానులుగ నున్నను, మాండలికరాజులు సేనాధిపతులు మొదలగు నున్నత రాజకీయోద్యోగీయు లనేకులు జైనమతావలంబకులై జైనమతాచార్యులకు బోషకులైనందను జైనమతము జనసామాన్యమతమై విజృంభించుచుండుటయు, జైనమతావలంబకు లయిన మాండలిక రాజులు సేనాధిపతులు సామ్రాజ్యాధిపత్యము నాక్రమించుట ప్రయత్నించుచుండుటయి జూచి సహింపజాలక శైవవైష్ణవ బ్రాహ్మణమతాచార్యుల నేకులు దక్షిణహిందూస్థానమున దమతమ మతసామ్రాజ్యములను స్థాపించుటకై అభినివేశముతో మతబోధనులు గావించు సమయమున జైనబౌద్ధ మతప్రళయకారకులో యన సంస్కర్తలనేకులు బయులువెడలి మతసాంఘీకవాతావరణమును; అల్లకల్లోలము గావించిన కాలమగుటంజేసి పండ్రెండవ శతాబ్దస్థితి అతిభయంకరముగ నుండెను. పండ్రెండవ శతాబ్ద ప్రారంభమున గర్ణాట మహారాష్ట్ర దేశములు పశ్చిమచాళుక్య సామ్రాజ్యమున?