పుట:Andhrula Charitramu Part 2.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రైరి. అందువలన వీర లుభయులకు జైనపండితులు శత్రువులుగ నుండిరి. మొదటిప్రతాపరుద్రుని కాలము మొదలుకొని కాకతీయాంధ్రచక్రవర్తులు జైన మతాచార్యులపట్ల నిరాదరమును శైవులపట్ట ప్రేమను జూపుచుండిరి. శైవ మతమునం దాదరము తగ్గినతోడనే జైనమతవలంబులకు జైనసామాన్యజనులు శైవమత మవలంబింపగా జైనమతాచార్యులనేకులు త్రిలింగ దేశామునువిడిచి పెట్టి కర్ణాటమహారాష్ట్రదేశములకు వలసపొయిరి. ఇంకను మఱికొందఱు జైనమతచార్యులు ధాన్యకటకము (ధరణికోట) ఏకశిలానగరము మొదలగు ప్రదేశముల నివసించియుండగా వారలకును బ్రాహ్మణులకును మతవివాదములును శాస్త్రచర్చలును జరుగుచు వచ్చెను. ఆవివదములను గూర్చి గాధ లనేకములు గలవు గాని యవి యంతగా విశ్వాసార్హములుగా గన్పట్టవు. అయినను బ్రాహ్మణు లనేక మాయోపాయములను గల్పించి ప్రతాపరుద్రుని తమ కనుకూలునిగ జేసికొని జైనమతాచార్యులు బాధించుచు వచ్చిరని జైనులు చెప్పెడిగాధలవలన దెలియుచున్నది. అందువలన జైనమతము త్రిలింగదేశమున నాశనమైనది. మహావిద్వాంసు లయిన జైనమతాచార్యులనేకులు వైష్ణవమతాచార్యు లయినట్లుగా గన్పట్టుచున్నది. ((center|జైనులు బ్రాహ్మణులను శపించుట.}}

    మంత్రవాదులసాహాయ్యముతొ మాయోపాయములు గల్పించి తమ్ము జయించినందులకు గనలుచు దు:ఖమును భరింప జాలక రోషమును బెంచి జైన మతాచార్యులు బ్రాహ్మణుల నీవిధముగా శపించి రట!
     ఈప్రతాపరుద్రుడు బ్రాహ్మణులు గావించిన మాయతంత్రము నెఱుంగజాలక మూర్ఖుడై మనకంటే బ్రాహ్మణులు మంత్రశకి కలవారనియు నధికులనియు విశ్వసించి బ్రాహ్మణప్రేరితుడై జైనుల పైన మనమతగ్రంధములను దగ్దము గావించి మనమడులు మాన్యము లాక్రమించుకొని మనశత్రువులకు వారపొయుచుండెను; ఇంక మనము బ్రతికి యుందినను జచ్చినవారితో