పుట:Andhrula Charitramu Part 2.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"సీ. అపఱవమండు నెఱ్ఱని చండ్రమల్లెల
         జోద్యంపు గుండాలు చొచ్చువారు
     కరవాడి యలుగుల కనరుపాతరలలో
        మట్టిచేరులు గోసి యుఱుకువారు
    కటికి యొగ్గాళంపు గండగత్తెర వట్టి
       మిసిమింతులును గాక మ్రింగువారు
గీ. సందులను వారసంబులు పలుపువారు
    యెడమగుడిచేత నారతు లిచ్చువారు
    సాహసము మూర్తిగైకొన్న సరణివారు
    ధీరహృదయులు మైలారు వీరభటులు."
గీ. వీరమైలారు దేవరవీరభటులు
    గొండ్లి యాణించుచున్నారు గొరగపడుచు
    నాడుచున్నది చూడు మర్ధాభినయము
    తాను నెట్టిగసీ లంత గాని లేదు.
చ. వెనుకకు మొగ్గ వ్రాలి కడు విన్నను నొప్పంగ దొట్టి నీళ్లలో
    మునిగి తదంతరిస్థ మగు ముక్కున గ్రుచ్చికొంచు లే
    చెను రసనాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే
    రనుపమలీల నిప్పుడు చుపాయము లిట్టిది యెట్లు పేర్చె నో"

    జైనమతావలంబకులును స్మార్తమతావలంబకు లయిన బ్రాహ్మణులును గాక తక్కిన;యగ్రవర్ణములవారిలో మూడించ రెండుపాళ్లు శైవులుగ నొక పాలు వైష్ణవులుగ నుండిరి.  వీరిలో వీరశైవులు రాజ్యాధికారప్రాబల్యము గలవా రగుటచేత బ్రాహ్మణులు వీరితోడ మైత్రి గలిగి యుండవలసినవా