పుట:Andhrula Charitramu Part 2.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"సీ.ఆశగజేంద్ర కర్ణానిలంబున దన
        ప్రకటప్రతాపాగ్ని ప్రజ్వరిల్ల
    దిగ్వధూదరహాస దీప్తులతో దన
       సితకీర్తిచంద్రికల్ చెలిమి సేయ
   సకలమహీపాలనసరిసిజాకరముల
      దనజయశ్రీవినోదంబు సలుప
  దతరిపుమకుట రత్నప్రభాబాలాత
     సంబున దనపదాబ్జంబు లలర
గీ. దనరు జలమర్త్యగందప్రతాపరుద్ర
      మనుజవిభువశు సేనానియును మహాధి
   కారియును నాప్తుడును నైపొగడ్తకెక్కి
      మెరు ధీరుడు నాగయ మేచశౌరి."

ఇందులూరి రుద్రరాజు.

   ఈ యిందులూరి రుద్రరాజు కాకతిప్రతాపరుద్రుని మాతామహియగు రుద్రమహా దేవికి ద్వితీయపుత్రిక యైన రుయ్యంబకు భర్తయైన యన్నమయునకు సోదరుడై యుండెను. ఇతదు ప్రతాపరుద్రుని సైన్యాధ్యక్షులలొ నొకడుగా నుండి యోరుగంటి యొక్క తూర్పుగవని మొదలుకొని తూర్పున సింహాచలపర్యంతముగల భూభాగ మునకంతకు రాజప్రతినిధియై పరిపాలనముచేసినట్తు గనంబడుచున్నది.  ఇందులూరి వారివంశావళి యని గ్రంధమున వీనిం గూర్చి వ్రాయంబడియుండెను. ఇతనియెడ బ్రతాపరుద్రునకుం గల 'రవాధిక్యమును, ఇతని పరాక్రమాదులను జూపుపద్యము లనేకము లదు వ్రాయబడినవి.  ఇతడు అన్నమదేవుని కన్న యనియును, ఏకశిలానగరము మొదలుకొని సింహాచలమువఱకు గల భూభాగమును బరిపాలించె నని యీ క్రింది పద్యములలో జెప్పబడినది.