పుట:Andhrula Charitramu Part 2.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"సీ. తనసంజ్జ్వలమూర్తి జనలోచనాంభోజ
          ములగు మార్తాండుని మూర్తిగాగ
     దవనయోపార్జిత ధనమున కర్ధి హ
         స్తములు నిక్షేపణస్థలులు గాగ
    దనభూరితరతేజ మనుపమ నిజవంశ
        భవనంబునకు బ్రదీపంబు గాగ
   దనవినిర్మలయశంబునకు దిశాతటం
        బులు దృఢశాసనశిలలు గాగ
గీ. బ్రకట గణగనసంపద బరలఘూఛూణ్ణా
      ధన్యు డధికపుణ్యుండు ప్రతాపరుద్ర
   దేవసామ్రాజ్యవర్ధనస్థిరవినీతి
      కరణకుశలుండు నాగయగన్నవిభుందు."

ఎల్లయనాఅకుడు. మేచయనాయకుండు

    ఇట్టి ప్రసిద్ధిగాంచిన నాగయగన్న విభునకు నిరువురు సోదరులు గలరు. వార లిరువురును గూడ ప్రతాపరుద్రుని సేనానులుగ నుండిర్.  వారిలో ఎల్లయ సైన్యనాధుడు గన్నమంత్రికి బెద్దతమ్ముడు. ఉన్మదపరపంధిసింధరసమాజ విదారణసింహ మని కవు లీతనిం గొనియాడుచుండిరి.  ఇతనికంటెను మూడవ సోదరుడైన మేచయనాయకుడు సుప్రసిద్ధుడు.  ఆకాలమునం దిత డెట్టి ప్రఖ్యాతి వహించి యుండినదియు నీక్రింది పద్యములవల బోధపడకమానదు.

"చ. నయవినయాభిరాము డగు నాగయ గన్నని కూర్మితమ్ముడ
      స్వయనవరత్న దీపము దివాకర తేజుడు రాజనీతి ని
     శ్చయనిపుణుండు నిర్మలవిచార వివేక పరాయణుండు మే
     చయరధినీశు దుజ్జ్వలయళస్ఫురణం బొగ డొంచె నిద్దరన్.