పుట:Andhrula Charitramu Part 2.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గలదనియును దెలియుచున్నది. కుప్పమాంబ, సోదరులలోనొకడగు కాటయకు కాచయ యను నామాంతరము గలదేమో తెలియరాదు. అప్పుడు కాచవిభుడును నిశిలభూపతియు కుప్పమాంబసొదరు లగుటచేత రంగనాధ రామాయణమును రచించిన బుద్ధారెడ్దియు, కుప్పమాంబ తండ్రి యగు గోన బుద్ధారెడ్దియు నొక్కరేయని చెప్పుటకు సంశయింపం బని లేదు.

నాగదేవమహారాజు.

   కాకతిరుద్రదేవి సైన్యాధ్యక్షులలో నొక్కడుగు నాగదేవమహారాజు విక్రమసింహ పురము రాజధానిగా పాకనాటిని బరిపాలనము సేయుచుండెను. ఇతనికి పోతయ సాహిణి మంత్రిగ నుండెను. ఈమహామండలేశ్వరుని గూర్చి నల్లూరి చరిత్రమునందు వివరించి యున్నాను.  మార్కండేయ పురాణమును గృతి నొందిన గన్నమంత్రి తండ్రియగు నాగదమూపతియు పైనాగదేవ మహారాజు నొక్క డేయని యూహింపవచ్చును. అట్లయినయెడలనాగదేవ దమూపతి చరుర్ధవంశమున జనించిన మల్లసైన్యబిభునకును పోలాంబకును బుట్టె నని మార్కండేయపురాణములోని:-

"ఆరమణీయ దంపతుల కన్వయరతనము బంధులోకమం
 దారము ధైర్యమందిర ముతాత్త దయానిధిదారధర్మ వి
 ద్యారసికుండు నాగవిభుడంచితభాగ్యపరుండు పుట్టే బెం
 పారశచీపురందరుల కర్ధిజయంతుడు పుట్టినట్లుగన్."

అను పద్యమువలన దేటపడగలదు. ఇతడు గణపతిదేవ చక్రవర్తి తలవరియైన మేచయనాయకుని కూతురగు మల్లమాంబికను వివాహ మయ్యెను. ఈ దంపతౌలకు జనించి ప్రతాపరుద్రచక్రవర్తికడ సైన్యాధిపతులుగ నుండి ప్రఖ్యాతి కెక్కిన గన్నయాదులు మార్కండేయ పురాణమున నిట్లభి వర్ణింపబడిరి.

"శా. అమల్లాంబకు నాగశౌరికివిశిష్టాచారు లుద్యద్గుణ
      స్తోమాకల్పులవల్పకీర్తిపరు లస్తొకస్థిరశ్రీయుతుల్